ఎన్టీఆర్ పాలిటిక్స్‌లోకి వ‌స్తే జ‌రిగేది అదే.. వేణు స్వామి సంచ‌ల‌నం!

admin
Published by Admin — July 08, 2026 in Politics, Andhra
News Image

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి(Venu Swamy).. తాజాగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తుపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గతంలో పలువురు సెలబ్రిటీల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలపై ఆయన చెప్పిన జోస్యాలు కొన్ని నిజం కావడంతో, తాజాగా తారక్ పాలిటిక్స్ ఎంట్రీపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

వేణు స్వామి విశ్లేషణ ప్రకారం.. జూనియర్ ఎన్టీఆర్ జాతకంలో అద్భుతమైన రాజయోగం ఉందట. తారక్ జన్మించింది 'మఖా' నక్షత్రంలో అని, ఈ నక్షత్రంలో పుట్టిన వారికి సహజంగానే అసాధారణ నాయకత్వ లక్షణాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. గతంలో తమిళనాడును శాసించిన దివంగత సీఎం జయలలిత కూడా ఇదే నక్షత్రంలో జన్మించారని గుర్తు చేస్తూ.. భవిష్యత్తులో ఎన్టీఆర్(NTR) కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఖాయమని సంచలన జోస్యం చెప్పారు. ఆయన పాలిటిక్స్‌లోకి వస్తే తిరుగులేని శక్తిగా ఎదుగుతారని జోస్యం చెప్పారు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి కూడా వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌ను ఒక పర్ఫెక్ట్ పొలిటీషియన్  గా ఆయన అభివర్ణించారు. ప్రజల్లో పవన్‌కు ఉన్న క్రేజ్, ఆయన రాజకీయ వ్యూహాలు ప్రస్తుతం సరైన ట్రాక్‌లో ఉన్నాయని మెచ్చుకుంటూనే.. భవిష్యత్తు పొలిటికల్ స్క్రీన్‌పై ఎన్టీఆర్ రీ-ఎంట్రీ ఇస్తే సమీకరణాలు పూర్తిగా మారిపోతాయనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Tags
Jr NTR Venu Swamy Pawan Kalyan NTR Political Entry NTR NTR Next CM Tollywood
Recent Comments
Leave a Comment

Related News