ఇట్స్ ఆఫీషియ‌ల్.. త్వ‌ర‌లోనే తరుణ్ భాస్కర్‌తో ఈషా రెబ్బా పెళ్లి..?

admin
Published by Admin — July 08, 2026 in Movies
News Image

టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ లవ్ స్టోరీ తెరపైకి వస్తుందో చెప్పడం కష్టం. తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న హాట్ టాపిక్.. టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఈషా రెబ్బా(Eesha Rebba) లవ్ అఫైర్. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ వస్తున్న వార్తలకు, తాజాగా వీరు ఎయిర్‌పోర్ట్‌లో జంటగా కనిపించడంతో మరింత బలం చేకూరింది. 'ఓంశాంతి శాంతి శాంతి' ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేసిన ఈ జోడీ, ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

సాధారణంగా ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు సెలబ్రిటీలు కొట్టిపారేస్తుంటారు. కానీ, తరుణ్ భాస్కర్(Tharun Bhascker) గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నాకు అన్నీ ఈషానే" అంటూ హింట్ ఇవ్వడం అప్పట్లో సంచలనమైంది. సరైన సమయం చూసి క్లారిటీ ఇస్తానని కూడా ఆయన అనడంతో, వీరి రిలేషన్‌షిప్‌పై ఫ్యాన్స్‌కు ఒక నమ్మకం వచ్చేసింది. తాజాగా తరుణ్ తన 'ఈ నగరానికి ఏమైంది-2' షూటింగ్ బిజీ షెడ్యూల్స్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని, ఈషాతో కలిసి వెకేషన్‌కు చెక్కేయడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ - రష్మిక(Vijay-Rashmika) మందన్న జంట కూడా ఇలాగే సైలెంట్‌గా లవ్ ట్రాక్ నడిపి, ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇప్పుడు తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా కూడా అదే రూట్‌ను ఫాలో అవుతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఎయిర్‌పోర్ట్ విజువల్స్ చూశాక, వీరు త్వరలోనే తమ పెళ్లి గురించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని నెటిజన్లు గట్టిగా ఫిక్స్ అయిపోయారు. మరి ఈ టాలీవుడ్ క్రేజీ కపుల్ ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతారో చూడాలి.

Tags
Tharun Bhascker Eesha Rebba Tollywood Weddings Tollywood Couples Om Shanti Shanti Shantihi
Recent Comments
Leave a Comment

Related News