మా వల్ల కాదు బాబోయ్.. జ‌గ‌న్‌కు కేడర్ షాక్‌.!

admin
Published by Admin — October 28, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఒక్కసారిగా రాజుకుంది. ఇన్నాళ్లూ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ శ్రేణులను ఏమాత్రం పట్టించుకోలేదనే అసంతృప్తి ఒకవైపు ఉంటే, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇస్తున్న పిలుపులు సొంత పార్టీ నేతలకే చెమటలు పట్టిస్తున్నాయి. స్థానిక ఎన్నికల సమీపిస్తున్న వేళ "మీ వెనుక నేనుంటాను.. ఎవరికీ భయపడవద్దు, ఏం చేసైనా ఎదురెళ్లండి" అంటూ జగన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర‌వ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అయితే, నాయకుడి పిలుపునకు ఊగిపోవాల్సిన కేడర్ మాత్రం అనూహ్యంగా వెనక్కి తగ్గుతుండటం గమనార్హం.

ఒకప్పుడు వైఎస్ కుటుంబం(YS Family) పిలుపునిస్తే ప్రాణాలైనా అర్పించేంత అభిమానం, గుడ్డి విధేయత కార్యకర్తల్లో కనిపించేది. కానీ మారిన రాజకీయ పరిస్థితులు, ఐదేళ్ల అనుభవాలు కేడర్ కళ్లు తెరిపించినట్లు స్పష్టమవుతోంది. అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి అండదండలు అందించకుండా, ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే తమను ముందర తోసి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని ద్వితీయ శ్రేణి నాయకులు గ్రహించారు. జగన్ మాటలు విని తొందరపడి గొడవలు, విధ్వంసాలకు దిగితే రేపు కోర్టులు, కేసుల చుట్టూ తిరగాల్సింది తమ కుటుంబాలేనని, ఆ సమయంలో అధినేత వచ్చి తమను కాపాడలేడనే చేదు నిజం వారికి బోధపడింది.

దీంతో "మా వల్ల కాదు బాబోయ్.." అంటూ వైఎస్సార్‌సీపీ(YSRCP) ముఖ్య నాయకులు, బాధ్యతాయుతమైన కార్యకర్తలు జగన్ ప్రేరేపిత వ్యాఖ్యలకు దూరంగా ఉంటూ సైలెంట్‌గా పక్కకు తప్పుకుంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు అడిగే పరిస్థితి లేదని, నామినేషన్లు వేసిన చోట కూడా గెలుపు అవకాశాలు మృగ్యమయ్యాయని గ్రహించడంతోనే పార్టీ నాయకత్వం ఇలాంటి అలజడులకు తెరతీస్తోందని స్థానికంగా చర్చ జరుగుతోంది.

బాధ్యతాయుతమైన కేడర్ నుంచి ఎలాంటి మద్దతు లభించకపోవడంతో, వైఎస్సార్‌సీపీ వ్యూహకర్తలు ప్రత్యామ్నాయ దారులు వెతుకుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ స్థాయిల్లో అసాంఘిక శక్తులు, గంజాయి ముఠాలు, క్రిమినల్ బ్యాచ్‌లను రప్పించి గొడవలు సృష్టించేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఈ విధ్వంసక మూకలతో అలజడులు రేపి, ఆపై మీడియా ముందుకు వచ్చి 'విక్టిమ్ కార్డ్' ప్లే చేయడమే లక్ష్యంగా కుట్రలు జరుగుతున్నాయని ఇన్‌సైడ్ వర్గాల్లో గుసగుసలు బ‌లంగా వినిపిస్తున్నాయి. మ‌రి జగన్(Jagan) వ్యూహం ఏమేరకు వర్కవుట్ అవుతుంది.. పోలీసులు జగన్ గొడవల ప్లాన్‌ను అట్టర్ ఫ్లాప్ చేయ‌డానికి ఎటువంటి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటారో  వేచి చూడాలి.

Tags
YS Jagan YSRCP AP Local Body Elections AP Politics Andhra Pradesh Pulivendula YSRCP Cadre AP News
Recent Comments
Leave a Comment

Related News