చేతులు త‌డ‌పాలి.. సాయం చెయ్ గురూ.. !

admin
Published by Admin — October 27, 2026 in Politics, Andhra
News Image

మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ల ఎన్నికల(Municipal Corporation Elections) నామినేష‌న్ ఘ‌ట్టం పూర్త‌యింది. ఇక‌, మిగిలింది.. నామినేష‌న్ల వ‌డ‌బోత‌, అభ్య‌ర్థు ల‌ను ఎన్నిక‌ల సంఘం ఖ‌రారు చేయ‌డం.. అనంత‌రం బీఫారాలు స‌మ‌ర్పించ‌డం. అయితే.. ఇక్క‌డే మ‌రో కీల‌క ప‌రిణామం కూడా ఎన్నిక‌ల ప్ర‌చారం. ఈ నెల 28న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అంటే.. సుమారు వారం రోజుల‌పాటు నాయ‌కులు ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉండాలి. మ‌రి ఎంతైనా.. ఎన్నిక‌లు ఎన్నిక‌లే కాబ‌ట్టి.. ఓట‌ర్ల‌నుమ‌చ్చిక చేసుకునేందుకు మార్గాలు త‌ప్ప‌వు!. పైగా ద‌స‌రా సీజ‌న్‌. దీంతో నాయ‌కులు ఇరుకున ప‌డుతున్నారు.

సో.. ఓటుకు ఎంత లేద‌న్నా.. 2 వేల చొప్పున ఇవ్వ‌క‌త‌ప్ప‌ద‌ని అన‌ధికారికంగా నాయ‌కులు లెక్క‌లు వేసుకుంటున్నారు. పైగా.. వైసీపీ(YCP) త‌ర‌ఫున బ‌ల‌మైన అభ్య‌ర్థులు ఉన్న ప్రాంతాల్లో అయితే.. ఈ పోటీ మ‌రింత ఎక్కువ‌గా ఉండ నుంది. దీంతో ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు చేతులు త‌డ‌ప‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో త‌మ‌కు తెలిసిన వారిని.. తెలియ‌ని వారిని కూడా కొంద‌రు క్షేత్ర‌స్థాయి నాయ‌కులు డ‌బ్బుల కోసం స‌ర్దుబాట్లు చేయాల‌ని కోరుతున్నారు. గ‌త రాత్రి నుంచి కూడా వ‌డ్డీ వ్యాపారుల‌కు ఫోన్ల మీద ఫోన్లు వ‌స్తున్నాయ‌ని అంటున్నారు.

పార్టీల ప‌రంగా చూసుకుంటే.. ఈ ఎన్నిక‌ల్లో(Elections) డ‌బ్బులు స‌ర్దుబాటు చేసే ప‌రిస్థితి లేదు. అసెంబ్లీ ఎన్నిక‌లైతే.. ఎంతో కొంత స‌ర్దుబాటు చేస్తున్న ప‌రిస్థితి ఉంది. కానీ, స్థానికంగా జ‌రుగుతున్న ఎన్నిక‌లు కావ‌డం, అభ్య‌ర్థుల బ‌లాబ‌లా ల‌ను ముందుగానే నిర్ధారించుకున్న ద‌రిమిలా.. పార్టీలు స‌ర్దుబాటుకు దూరంగా ఉన్నాయి. కానీ, అభ్య‌ర్థుల‌కు ఖ‌ర్చు త‌డిసి మోపెడ‌వుతోంది. ముఖ్యంగా కూట‌మిలో అయితే.. ఈ ఖ‌ర్చు నాలుగింత‌లు పెరుగుతుంద‌ని అంచ‌నా వేసుకుంటున్నారు. సొంత పార్టీతోపాటు.. అభ్య‌ర్థులు మిత్ర‌ప‌క్షాల నాయ‌కుల‌ను కూడా త‌మ వెంట తిరిగేలా చేసుకోవాలంటే.. జేబుల‌కు ప‌ని చెప్ప‌క‌త‌ప్ప‌ద‌ని అంటున్నారు.

ఇదొక్క‌టే కాదు..!
ఇక‌, ఈ ఎన్నిక‌ల వేళ మ‌రో కీల‌క అంశం కూడా  ఉంది. రెబ‌ల్స్‌గా బ‌రిలో నిలిచిన నాయ‌కుల‌ను బుజ్జ‌గించేందు కూడా సొమ్ముల‌కు ప‌ని చెప్పాల్సి వ‌స్తోంద‌నే టాక్ వినిపిస్తోంది. చాలా మంది నాయ‌కులు త‌మ త‌మ పార్టీల నుంచే రెబ‌ల్స్‌గా బ‌రిలో నిలిచారు. వీరిని త‌ప్పించాలంటే.. వారి ఆకాంక్ష‌ల‌తో పాటు.. వారిని కూడా బుజ్జ‌గించాల్సి ఉంటుంది. దీంతో స్థానిక స‌మ‌రంలో(Local Polls) సొమ్ముల వేట కొన‌సాగుతోంది. ప్ర‌తి ఒక్క‌రినీ సంతృప్తి ప‌ర‌చ‌డం సాధ్యం కాక‌పోయినా.. ఉన్నంత‌లో ఉన్నంత త‌మ గెలుపు కోసం నాయ‌కులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో ఫోన్లు చేసి.. సొమ్ములు స‌ర్దుబాటు చేయాలని విన్న‌విస్తున్నారు.

Tags
AP Municipal Elections Local Body Elections Vote For Cash AP Politics Political Funding
Recent Comments
Leave a Comment

Related News