జ‌గ‌న్‌ను న‌మ్మితే అంతే: చంద్ర‌బాబు

admin
Published by Admin — October 27, 2026 in Andhra
News Image

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ ను న‌మ్మితే న‌ట్టేట ముంచుతార‌ని చెప్పారు. ఒక్క ఛాన్స అంటూ.. అధికారంలోకి వ‌చ్చి రాష్ట్రాన్ని, ప్ర‌జ‌ల‌ను కూడా ముంచేశార‌ని చెప్పారు. త‌న సొంత కుటుంబానికే ఆయ‌న వెన్నుపోటు పొడిచార‌ని.. సొంత చెల్లికి కూడా అన్యాయం చేశార‌ని పేర్కొన్నారు. మేన‌కోడలు పెళ్లి జ‌రుగుతుంటే అడ్డు ప‌డుతున్నార‌ని ఆరోపించారు. పెళ్లికి ఇల్లు ఇస్తే.. పోయేదేంట ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తాజాగా ఎన్డీయే మిత్ర‌ప‌క్షాల ఉమ్మ‌డి స‌మావేశంలో చంద్ర‌బాబు మాట్లాడారు.

వైసీపీ పాలనలో 'విధ్వంసం'తో రాష్ట్రానికి తీరని నష్టం జరిగింద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఇంటికి ప‌న్ను, ఒంటికి ప‌న్ను అన్న‌ట్టుగా ప్ర‌జ‌ల‌ను పీడించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విద్యుత్ విష‌యంలో ప్ర‌జ‌ల‌ను నానాటికీ ఇబ్బందులు పెట్టార‌ని తెలిపారు. 2024 ఎన్నికల్లో కూటమికి ప్రజలు అద్భుత విజయాన్ని అందించారని, అప్ప‌టి నుంచి విద్యుత్ చార్జీల‌ను త‌గ్గిస్తున్నామ‌ని చెప్పారు. 94 శాతం స్ట్రైక్‌రేట్' సాధించామంటే.. వైసీపీ పాలనతో ప్రజలు ఎంత విసిగిపోయారో అర్థమవుతుందని చెప్పారు.

విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యత ప్రజలు మాకు అప్పగించారని చంద్ర‌బాబు తెలిపారు. అభివృద్ధికి ఆటంకం కలగకుండా శాయశక్తులా కృషిచేస్తున్నామ‌న్నారు. కేంద్ర ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో ఇవన్నీ సాధ్యమయ్యాయని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, అయిన‌ప్ప‌టికీ సాగు, తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూస్తున్నామ‌న్నారు. అన్ని రిజర్వాయర్లలో నీళ్లు నిల్వ చేసుకుని తాగునీటి సమస్య లేకుండా చేశామ‌న్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని చంద్ర‌బాబు సూచించారు.

కూట‌మి పార్టీల‌కు చెందిన ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలని చంద్ర‌బాబు సూచించారు. ప్రత్యక్ష ఎన్నికల వల్ల నాయకత్వం స్థిరంగా ఉంటుందని అభిప్రాయ‌ప‌డ్డారు. అభ్యర్థుల విషయంలో విద్యావంతు లు, యువత, నిజాయితీపరులకు అవకాశం ఇచ్చామ‌ని తెలిపారు. అయితే.. త‌మ వ్య‌వ‌హారాల్లోకి కూడా వైసీపీ చొచ్చుకు వ‌చ్చి విష ప్ర‌చారం చేస్తోంద‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. గొడ్డలి పార్టీ'కి రాష్ట్రం అభివృద్ధి చెందడం ఏమాత్రం నచ్చదని దుయ్య‌బ‌ట్టారు. బీసీలకు కల్పించిన రిజర్వేషన్లను అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ కోర్టులకెళ్లిందన్నారు. గొడ్డలి పార్టీ నాయకుడు రెండు రోజులు ఇక్కడ తిరిగి అబద్ధాలన్నీ చెప్పి, బెంగళూరు వెళ్తారని,అలాంటి వ్య‌క్తిని ప్ర‌జ‌లు న‌మ్మొద్ద‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. 

Tags
Don't believe jagan says CM Chandrababu
Recent Comments
Leave a Comment

Related News