,మీ క‌ళ్ల‌లో ర‌క్తం తెప్పిస్తా: జక్కంపూడి

admin
Published by Admin — October 27, 2026 in Politics
News Image

ఒక ఎదురు దెబ్బ‌తో మార్పు రావాలి. వ్య‌క్తిగ‌తంగా అయినా.. రాజ‌కీయంగా అయినా.. ఇది అత్యంత ముఖ్యం. రాజ‌కీయాల్లో ఉన్న వారు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ప్ర‌జాతీర్పును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని మార్పు దిశ‌గా అడుగులు వేయాలి. వారి అభిమానాన్ని సొంతం చేసుకునే ప్ర‌య‌త్నంచేయాలి. కానీ, గ‌త ఎన్నిక‌ల్లో చావు దెబ్బ‌తిన్న‌ప్ప‌టికీ.. వైసీపీ నేత‌ల్లో ఆ త‌ర‌హా మార్పు క‌నిపించ‌డం లేదు. ప్ర‌జ‌ల‌ను, అధికారుల‌ను కూడా ల‌క్ష్యంగాచేసుకుని మాట‌ల దాడి కొన‌సాగిస్తున్నారు. ఒక‌రు మీ అంతు చూస్తా.. అంటూ బెదిరింపుల‌కు దిగుతుంటే.. మ‌రొక‌రు మీ క‌ళ్ల‌లో ర‌క్తం తెప్పిస్తా అంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన తీరు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది.

 

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి వైసీపీ నేత‌లు డిఫెన్స్‌లో ప‌డుతున్నారు. కొన్ని చోట్ల అభ్య‌ర్థులు లేక నామినేష‌న్లు వేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రికొన్ని స్థానాల్లో అభ్య‌ర్థులు ఉన్నా.. నామినేష‌న్లు వేసినా.. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల్లో వారు త‌మ నామినేష‌న్ల‌ను వెన‌క్కి తీసుకున్నారు. దీంతో కీల‌క నాయ‌కులు, మాజీ మంత్రులు ఈ ప‌రిణామాల‌ను అర్ధం చేసుకోకుండా నోటికి ప‌నిచెబుతున్నారు. ఫ‌లితంగా వైసీపీ ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారే ప‌రిస్థితిని తీసుకువ‌స్తున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది.

 

రాజాగారి స‌వాల్‌..

 

వైసీపీ సీనియ‌ర్ నేత‌,తూర్పుగోదావ‌రి జిల్లా రాజాన‌గ‌రం మాజీ ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజా.. అధికారులు స‌హా టీడీపీనేత‌ల‌పై నోరు చేసుకున్నారు. వైసీపీ త‌ర‌ఫున ఓ ఎంపీటీసీ స్థానానికి మ‌ణికంఠ అనే వ్య‌క్తితో ఈయ‌న నామినేష‌న్ వేయించారు. అయితే..ఆయ‌న నామినేష‌న్ ఉప‌సంహ‌రించుకుని.. గ్రామ పెద్ద‌ల తీర్మానానికిక‌ట్టుబ‌డిన‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో ఆగ్ర‌హోద‌గ్రుడైన రాజా.. స‌ద‌రు మ‌ణికంఠ‌ను చెప్పుతో కొట్టాడు. ఈ వ్య‌వ‌హారం తీవ్ర దుమారానికి దారితీసింది. పోలీసులు కేసు న‌మోదు చేశారు. అయితే.. దీని వెనుక టీడీపీ నేత‌లు.. ఉన్నార‌ని భావించిన రాజా.. ``మీ క‌ళ్ల‌లో ర‌క్తం తెప్పిస్తా`` అంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అంతేకాదు.. కేసుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని.. బెదిరేది లేద‌ని బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

 

హ‌ఫీజ్ ఖాన్‌.. నోటి దూల‌

 

క‌ర్నూలు మాజీ ఎమ్మెల్యే, మైనారిటీ వైసీపీ నేత హ‌ఫీజ్ ఖాన్ సైతం.. నోటికి ప‌నిచెప్పారు. స్థానిక ఎన్నిక‌ల్లో ఆయ‌న ప్ర‌చారం నిర్వ‌హించ గా.. అదే దారిలో టీడీపీ నేత‌లు కూడా వ‌చ్చారు. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య ర‌గ‌డ చోటు చేసుకుంది. దీంతో కారు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. అదే కారుపైకి ఎక్కిన హ‌ఫీజ్.. మీ అంతు చూస్తా.. అంటూ వేలు పెట్టి మ‌రీ టీడీపీ నేత‌ల‌ను హెచ్చ‌రించ‌డం.. పోలీసుల‌ను దూషించ‌డంతో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. దీంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో మ‌రింత రెచ్చిపోయిన హ‌ఫీజ్‌.. దూష‌ణ‌ల స్థాయిని అమాంతం పెంచేశారు. ఈ ప‌రిణామాలు స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. వైసీపీ నేత‌లు మార‌రు.. అనే మాట వినిపించేలా చేస్తున్నాయి.

Tags
Ycp ex mla jakkampudi
Recent Comments
Leave a Comment

Related News