టాలీవుడ్(Tollywood) యంగ్ డైరెక్టర్ అరెస్ట్ అయినట్లు వస్తున్న వార్తలు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ దర్శకుడిపై నటి చేసిన తీవ్ర ఆరోపణలు, సంచలన ఫిర్యాదు ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ సదరు యంగ్ డైరెక్టర్‌పై ఆమె పోలీసులను ఆశ్రయించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంతకూ ఎవరా నటి... ఎవరా యంగ్ డైరెక్టర్ అనేది ఆరా తీస్తే..
నటి గాయత్రీ గుప్తా ఫిర్యాదు మేరకు.. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని(Pavan Sadineni)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ సినిమా 'ఫిదా'లో సాయి పల్లవి ఫ్రెండ్‌గా నటించి గాయత్రీ గుప్తా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు రంగంలోకి దిగి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
లఘు చిత్రాల ద్వారా కెరీర్ ప్రారంభించి, 'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాతో దర్శకుడిగా మారిన పవన్ సాధినేని.. ఆ తర్వాత పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా భారీ బడ్జెట్‌తో 'ఆకాశంలో ఒక తార' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలోనే దర్శకుడు రిమాండ్‌కు వెళ్లడం సినీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉండగా.. టాలీవుడ్ సర్కిల్స్‌లో మాత్రం ఈ పరిణామం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.