అభిమాని మృతికి పవన్ సంతాపం

admin
Published by Admin — July 09, 2026 in Politics
News Image

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమాని, తెలంగాణ‌లోని హ‌నుమ‌కొండ‌కు చెందిన 17 ఏళ్ల నిరంజ‌న్‌.. ఆసుప‌త్రిలో క‌న్నుమూశారు. పుట్టుక‌తోనే జ‌న్యుప‌ర‌మైన సమ‌స్య‌ల‌తో పుట్టిన నిరంజ‌న్‌.. ఎదుగుద‌ల లేక మంచానికే ప‌రిమితం అయ్యారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే.. ప్రాణం పెట్టే నిరంజ‌న్‌.. త‌న‌కు ఆయ‌న‌ను చూడాల‌ని ఉంద‌ని కోర‌డంతో ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ప్ర‌త్యేకంగా హ‌నుకొండ‌కు వెళ్లి నిరంజ‌న్‌తో దాదాపు రెండు గంట‌ల‌పాటు గ‌డిపారు.

తిరుమ‌ల శ్రీవారి ప్ర‌సాదాల‌ను, శేష వ‌స్త్రాన్ని కూడా అందించి.. ఆరోగ్యం బాగుండాల‌ని కోరుకున్నారు అ లాగే వ‌రంగ‌ల్ భ‌ద్ర‌కాళీ అమ్మ‌వారికి కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్యేక పూజ‌లు చేయించి.. నిరంజన్‌ బాగుండా ల‌ని కోరుకున్నారు. ఇది జ‌రిగి.. ప‌ట్టుమ‌ని 20 రోజులు కూడా కాక‌ముందే.. నిరంజ‌న్ ఆరోగ్యం విష‌మించి బుధ‌వారం తెల్ల‌వారు జామున హ‌నుమ‌కొండలోని ఆసుప‌త్రిలోని తుదిశ్వాస విడిచారు. ఈ విష‌యం తెలిసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

నిరంజ‌న్ ఇక లేడ‌నే వార్త త‌న‌ను ఎంతో క‌ల‌చి వేసింద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు. ఇటీవలే తాను నిరంజ‌న్‌తో క‌లిసి కులాసాగా గ‌డిపాన‌ని గుర్తు చేసుకున్నారు. త‌న క‌ళ్ల‌లో నిరంజన్ ఇంకా మెదులుతూనే ఉన్నాడ‌ని, ఆ ముఖంపై విరిసిన చిరున‌వ్వు.. ఇంకా తాను మ‌రిచిపోలేద‌ని పేర్కొన్నారు. నిరంజ‌న్ విష యంలో ఈ జ్ఞాప‌కాలు త‌న‌కు ఎప్ప‌టికీ చెక్కుచెద‌ర‌కుండా ఉంటాయ‌న్నారు. అనారోగ్యంతో పోరాడుతూ నే.. ఆత్మ‌విశ్వాసంతో జీవించాడ‌ని పేర్కొన్నారు.

శ‌రీరం బాధిస్తున్నా.. మ‌న‌సు మాత్రం ఎంతో ద్రుఢంగా ఉంద‌ని పేర్కొన్నారు. అంత‌టి బాధ‌లోనూ జీవి తంపై ఎంతో ఆశ‌తో ఉన్నాడ‌ని తెలిపారు. నిరంజ‌న్  చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవని, అలాంటి ధైర్యవంతుడు ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరమ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. కాగా, నిరంజ‌న్ కోరిక మేర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ప‌ప్పీని ఇవ్వ‌డంతోపాటు ఆయ‌న తండ్రికి ప్ర‌త్యేకంగా క్యాంటీన్ ఏర్పాటు చేసుకునేందుకు సాయం అందిస్తాన‌ని హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. 

Tags
AP deputy CM Pawan Kalyan pawan's fan niranjan died
Recent Comments
Leave a Comment

Related News