రేవంత్ ను ఉరేసినా తప్పు లేదు: హరీశ్

admin
Published by Admin — July 09, 2026 in Telangana
News Image

తెలంగాణలో సాగునీటి స‌మ‌స్య‌, నీటిని విడుద‌ల చేయ‌క‌పోవ‌డం, ప్రాజెక్టుల వ్య‌వ‌హారంపై అధికార‌, ప్ర‌ధా న ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో తాజాగా బుధ‌వారం హ‌రీష్‌రావు.. రాష్ట్రంలోని ప్రాజెక్టుల‌పై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా మీడియాకు వివ‌రించారు. దేవాదుల‌లో నీటి ల‌భ్య‌త పుష్క‌లంగా ఉంద‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. ఉద్దేశ పూర్వ‌కంగానే నీటిని విడుద‌ల చేయ డం లేద‌ని ఆరోపించారు. ``ఇది పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ల‌క్ష్యం`` అని వ్యాఖ్యానించారు.

``ఇంత‌ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న మిమ్మ‌ల్ని ఉరితీసినా త‌ప్పులేదు.`` అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశా రు. రేవంత్ ఇప్పుడు చేప‌ట్టే ప్ర‌తిప్రాజెక్టుకు మూలం కాళేశ్వ‌ర‌మేన‌ని హ‌రీష్‌రావు చెప్పారు. కానీ, కాళేశ్వ రంపై మాత్రం అవాకులుచ‌వాకులు పేలుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. తుమ్మ‌డిహ‌ట్టి పేరుతో వేల కోట్ల రూపాయ‌ల సొమ్మును అధికార పార్టీ నాయ‌కులు సొంతం చేసుకున్నార‌ని ఆరోపించారు. దీనిపై స‌మాధా నం చెప్పేవారే లేకుండా పోయార‌ని అన్నారు.

రాజీనామా స‌వాల్‌..

ఇదేస‌మ‌యంలో హ‌రీష్‌రావు.. సీఎం రేవంత్ కు రాజీనామా స‌వాల్ రువ్వారు. తుమ్మిడి హ‌ట్టి ఎత్తు పెంచు కునేందుకు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింద‌ని రేవంత్ చెబుతున్నార‌ని, ఇదే నిజ‌మైతే.. స‌ద‌రు ఒప్పందం తాలూకు ప‌త్రాల‌ను బ‌య‌ట పెట్టాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ఒప్పందం నిజమైతే.. తుమ్మ‌డి హ‌ట్టి ఎత్తు పెంపున‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇస్తే.. తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని స‌వాల్ రువ్వారు.

గురుద‌క్షిణ‌..

రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ఫ‌ణంగా పెట్టి గురు ద‌క్షిణ చెల్లిస్తున్నార‌ని హ‌రీష్‌రావు విమ‌ర్శించారు. వ‌రంగ‌ల్ లో చెరువులు ఎండిపోయ‌య‌ని, అయినా.. ఇక్క‌డ‌కు దేవాదుల నుంచి నీరు ఇవ్వ‌కుండా.. ఏపీకి న్యాయం చేసేందుకు, గురువుకు ద‌క్షిణ చెల్లించేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని విమ‌ర్శించారు. ``నీళ్లు ఉండి కూడా లిఫ్ట్‌ చేయకపోవడం నేరపూరిత నిర్లక్ష్యం`` అని వ్యాఖ్యానించారు.  తుమ్మ‌డిహ‌ట్టి వ‌ద్ద‌నీటి లభ్య‌త త‌క్కువ‌గా ఉంద‌ని.. అందుకే అక్క‌డ ప‌నులుచేప‌ట్టేలేద‌ని బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను ఆయ‌న వివ‌రించారు. రాష్ట్రానికి కాళేశ్వ‌రం గుదిబండ కాద‌న్న హ‌రీష్‌రావు.. జ‌ల సంజీవ‌ని అని పేర్కొన్నారు.

Tags
cm revanth reddy ex minister harish rao shocking comments
Recent Comments
Leave a Comment

Related News