చెవిరెడ్డికి అది నా భిక్ష: సుధా రెడ్డి

admin
Published by Admin — November 08, 2026 in Andhra
News Image

తిరుపతి రూరల్ జెడ్పిటిసి స్థానంలో వైసిపి అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్ గెలిచారు. అయితే, చెవిరెడ్డి కుటుంబ సభ్యులు రీకౌంటింగ్ వద్దు అని తనను కోరడంతోనే తను సైలెంట్ అయిపోయానని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య పులివర్తి సుధా రెడ్డి వ్యాఖ్యానించారు. మానవతా దృక్పథంతో చెవిరెడ్డికి ఈ సీటు బిక్ష వేసామని ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. 

ఇప్పటికే తమ పెద్ద కొడుకు ఎన్నికల్లో ఓడిపోయాడని, ఇప్పుడు చిన్న కొడుకు కూడా ఓడిపోతే తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడని చెవిరెడ్డి కుటుంబీకులు ప్రాధేయపడ్డారని ఆమె తెలిపారు. వారి పరిస్థితిని అర్థం చేసుకుని, కేవలం మానవతా దృక్పథంతో ఆలోచించే రీకౌంటింగ్ పిటిషన్ దాఖలు చేయలేదని సుధారెడ్డి వివరించారు. ఆ నిర్ణయం తీసుకోవడం ద్వారా తాము తప్పు చేశామని ఆమె ఇప్పుడు వ్యాఖ్యానించారు. సుధారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

 

Tags
Sudha Reddy
Recent Comments
Leave a Comment

Related News