హే రామ్ అంటున్న జగన్!

admin
Published by Admin — November 06, 2026 in Andhra
News Image

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ పై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సంచలన ఆరోపణలు చేశారు. వ్యవస్థలను, అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకొని ఈ ఎన్నికలను చంద్రబాబు కబ్జా చేశారని జగన్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి ఓడాడని, తాము ఓడి గెలిచామని జగన్ అన్నారు. ఈ అక్రమాలపై తాము ధైర్యంగా పోరాడి జాతీయ స్థాయిలో ఎండగట్టామని జగన్ అన్నారు.

మహాభారతంలోని శకుని మాయాజూదం ఆడినట్లు...చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని కూటమికి అనుకూలంగా వాడుకున్నారని విమర్శించారు. ఎన్నికల సంస్కరణలపై అధ్యయనం చేయడానికి ఈ ఎన్నికలు ఒక కేస్ స్టడీగా ఉపయోగపడతాయని విమర్శించారు. ‘‘హే రామ్..సేవ్ ఆంధ్రా..హే రామ్ సేవ్ డెమోక్రసీ’’ అని జగన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. క్రిస్టియన్ ముద్ర ఉన్న జగన్ నోట హే రామ్ అన్న మాట తొలిసారిగా రావడం విశేషం.

ఇక, ఈ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ లో అవకతవకలు జరిగాయని జగన్ షాకింగ్ ఆరోపణలు చేశారు. రాత్రికి రాత్రి విశాఖలో పోలింగ్ పర్సంటేజ్ ఏ రకంగా మారిందో చెప్పాలని అని ప్రశ్నించారు. విశాఖలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు 9,18,367 ఓట్లు పోల్ అయ్యాయని చెప్పారని, రాత్రి 9.30కు ఓట్ల సంఖ్య 9,45,915 కు పెరిగిందని వెల్లడించారు. అయితే, సోమవారం పొద్దున 9.30 గంటలకు పోలైన ఓట్ల సంఖ్య 10,35,154 ఓట్లకు పెరిగిందని ఎలా ప్రకటించారని జగన్ నిలదీశారు.

రాత్రికి రాత్రి 51.64 శాతం..నుంచి 56.30 శాతానికి ఎలా పెరిగిందో ఎన్నికల సంఖం వెల్లడించాలని డిమాండ్ చేశారు. విశాఖలో లక్షా 15 వేల ఓట్లు పెంచారని, ఆఖరికి విశాఖలో స్ట్రాంగ్ రూంలకు సీల్ కూడా వేయలేదని, వైసీపీ నేతలు ధర్నా చేస్తే సీల్ వేశారని ఆరోపించారు.

పోలీసులు అన్యాయం చేస్తున్నారని, అందుకే ఆర్వో కార్యాలయం ముందు ధర్నా చేసిన తన మీద కూడా కేసు పెట్టారని అన్నారు. చేయకూడని పనులు కూడా పోలీసులు చేస్తున్నారని, అధికారాన్ని దుర్వినియోగం చేసేందుకు సిద్ధపడుతున్నారని చెప్పారు. అయితే, కేసులు పెడితే భయపడే ప్రసక్తే లేదని అన్నారు. అయితే, ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ రోజున ధర్నాలకు అనుమతి ఉండదు కాబట్టే జగన్ పై కేసు పెట్టారు. ఈ విషయం కూడా జగన్ కు తెలియదా? అని విమర్శలు వస్తున్నాయి.

పోలింగ్ సందర్భంగా కొన్ని వీడియోలను మీడియా ప్రతినిధులకు జగన్ ప్రదర్శించారు. వైసీపీ నాయకులు,కార్యకర్తలు నిజంగా హీరోల్లాగా పోరాటం చేశారని, వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. రెండేళ్ల తర్వాత మిమ్మల్ని చుచ్చు పోయిస్తానంటూ ఒక వైసీపీ కార్యకర్త అన్న మాటల వీడియోను చూసి పాత్రికేయులు, జగన్ నవ్వుకున్నారు.

Tags
Ex cm jagan says hey ram
Recent Comments
Leave a Comment

Related News