గుంటూరులో నూతనంగా ఎన్నికైన మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గారితో పాటు గల్లా మాధవి గారు, నాని గారు మరియు నూతన కార్పొరేటర్లకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ గారు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ 2019–24 మధ్య కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న సమయంలో పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన నాయకులు, కార్యకర్తల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా నాని గారు పార్టీకి అండగా నిలబడి, పార్టీ ఆదేశాలను గౌరవిస్తూ ఐదేళ్లపాటు అంకితభావంతో పనిచేయడం అభినందనీయమన్నారు. పదవులు, టికెట్లు ఆశించకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే నాయకులకు పార్టీ ఎల్లప్పుడూ తగిన గుర్తింపు ఇస్తుందని తెలిపారు.
గుంటూరు నగరంలో భార్యాభర్తలిద్దరూ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించడం ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిణామమని, నాని గారి రాజకీయ అనుభవం, స్థానిక పరిస్థితులపై ఉన్న అవగాహన నూతన మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గారికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మహిళా సాధికారతే లక్ష్యం – ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్త రావాలి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఇంటి నుంచి ఒక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయని తెలిపారు. మహిళలు స్వయంగా వ్యాపారాలు ప్రారంభించేందుకు బ్రాహ్మణ కార్పొరేషన్ తరఫున అవసరమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
ఖాదీ బోర్డు ద్వారా అందించే శిక్షణ కార్యక్రమాలను కార్పొరేషన్ సహకారంతో నిర్వహించేందుకు కృషి చేస్తామని, ఆసక్తి కలిగిన సుమారు 50 మంది మహిళలను ఒక బృందంగా ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. అనంతరం బ్యాంకుల సహకారంతో రుణ సదుపాయాలు పొందేలా మార్గనిర్దేశం చేస్తామని చెప్పారు. సంబంధిత పథకాల నిబంధనలు, అర్హతలకు అనుగుణంగా రూ.20 లక్షల వరకు వ్యాపార రుణ అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బ్రాహ్మణ విద్యార్థినుల కోసం మహిళా హాస్టల్ ఏర్పాటు చేయాలి
గుంటూరులో ఉన్నత విద్య కోసం వచ్చే బ్రాహ్మణ విద్యార్థినులు ఎదుర్కొంటున్న వసతి సమస్యలను ప్రస్తావిస్తూ, హిందూ కళాశాల పరిధిలో లేదా అనువైన ప్రాంతంలో స్థలం కేటాయించి మహిళా హాస్టల్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు స్థానిక పెద్దలు, ప్రజాప్రతినిధులు, మేయర్ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
మహిళా హాస్టల్‌తో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తే విద్యార్థినులకు విద్య, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి స్థానిక నాయకులు, దాతలు ముందుకు రావాలని కోరారు.
బ్రాహ్మణ యువత వ్యాపార రంగంలో రాణించాలి
ఒకప్పుడు వ్యాపార రంగంలో బ్రాహ్మణ సమాజానికి మంచి ప్రాధాన్యత ఉండేదని, కాలక్రమేణా ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం ఉద్యోగాలకే పరిమితం చేయకుండా వ్యాపార రంగంలోనూ ప్రోత్సహించాలని సూచించారు.
ముఖ్యంగా మహిళలు, యువత చిన్న చిన్న వ్యాపారాలతో ప్రారంభించి ఆర్థికంగా ఎదగాలని, ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే సామాజికంగా, రాజకీయంగా కూడా బలపడగలమని స్పష్టం చేశారు.
రాజకీయాల్లో బ్రాహ్మణులకు సముచిత ప్రాతినిధ్యం
2026 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ద్వారా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పలువురు మహిళలు, నాయకులు కార్పొరేటర్లుగా ఎన్నిక కావడం సంతోషకరమని అన్నారు. విజయవాడ, మచిలీపట్నం, ఒంగోలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో బ్రాహ్మణ నాయకులకు రాజకీయంగా అవకాశాలు లభించడం శుభపరిణామమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని 41వ వార్డు కార్పొరేటర్ టి. గాయత్రి గారు, 43వ వార్డు కార్పొరేటర్ ఆర్. గాయత్రి గారు ఎన్నిక కావడం బ్రాహ్మణ మహిళలకు లభించిన రాజకీయ ప్రాతినిధ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. మహిళలు రాజకీయాల్లో మరింతగా ఎదిగి ప్రజాసేవలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
జిల్లా పరిషత్ ఎన్నికల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన బ్రాహ్మణ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలను వారి కుటుంబ సభ్యులతో సహా ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ సమాజ రాజకీయ ఎదుగుదల, సంక్షేమం, కూటమి పార్టీల బలోపేతం వంటి అంశాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.
గుంటూరు అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కీలకం
గుంటూరు నగర అభివృద్ధికి కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ మద్దతును సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. నగరంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, ముఖ్యంగా వంతెన నిర్మాణం, విస్తరణ వంటి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆకాంక్షించారు. గతంలో శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులను ప్రస్తుత ప్రజాప్రతినిధులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.
గుంటూరు నగర అభివృద్ధికి మేయర్, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సమన్వయంతో పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని తెలిపారు..
చివరిగా నూతనంగా ఎన్నికైన మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గారికి, 41వ వార్డు కార్పొరేటర్ టి. గాయత్రి గారికి, 43వ వార్డు కార్పొరేటర్ ఆర్. గాయత్రి గారికి, నూతన కార్పొరేటర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ 2029 ఎన్నికల్లో గతంలో కంటే మరింత మెజారిటీతో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఒక బ్రాహ్మణ సోదరుడిగా, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్‌గా బ్రాహ్మణ సమాజ విద్యా, ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కె. బుచ్చి రామ్ ప్రసాద్ గారు హామీ ఇచ్చారు.
జై బ్రాహ్మణ్! జై బ్రాహ్మణ్!