టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నాయకులు సెటైర్లు వేస్తుంటారు. ఆయన మాట పార్టీలో ఎవరూ వినరని.. క్షేత్రస్థాయి నాయకులకు చంద్రబాబు అంటే భయం, భక్తీ లేదని చెబుతారు. అంతేకాదు.. దారి తప్పుతున్న నేతలపైనా ఆయన చర్యలు ఉండవని ఆక్షేపిస్తారు. వార్నింగ్ ఇచ్చి వదిలేయడం తప్ప.. చంద్రబాబుకు ఏమీ చేతకాదని కూడా అంటారు. ఇదేసమయంలో వైసీపీ అధినేత జగన్ మాత్రం.. తమ నాయకులను గాడిలో పెట్టే క్రమంలో సీరియస్ గా ఉంటారని.. చిన్న తేడా వచ్చినా.. వెంటనే పక్కన పెడతారని కూడా గొప్పలకు పోతారు.
ఇటీవల రేపల్లె నియోజకవర్గంలోనూ ఇలానే.. జగన్ వ్యవహరించారు. పార్టీలో గాడి తప్పారంటూ.. ఓ కీలక నాయకు డిపై వేటు వేశారు. ఇది చాలా గొప్ప నిర్ణయమని వైసీపీ అనుకూల మీడియా కూడా ప్రచారం చేసుకుంది. ఇదేసమ యంలో చంద్రబాబుకు రాజకీయాలు చేతకాదని కూడా విసుర్లు రువ్వింది. కానీ.. వాస్తవం ఏంటంటే.. నొప్పి వచ్చిందని చెయ్యిని నరుక్కునే టైపు లో చంద్రబాబు ఆలోచన చేయరు. తల నొప్పి వచ్చిందని తలను తీసేసుకునే టైపులో రాజకీయాలు ఉండవు. అన్ని విషయాలను సీరియస్ గానే తీసుకుంటారు.
కానీ, అందరినీ కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. రాజకీయంగా బలమైన కాంపిటీషన్ ఉన్న నేపథ్యంలో ఏ చిన్నకా ర్యకర్తను దూరం చేసుకున్నా.. అది పార్టీపై బలమైన ప్రభావం చూపుతుందని చంద్రబాబు ఆలోచన చేస్తారు. అందుకే.. ఆయన దగ్గర చర్యల కంటే కూడా.. మార్పుల దిశగా నాయకులు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తారు. ఆ తరహా పరిణామమే ఇప్పుడు టీడీపీని కాపాడింది. పార్టీలో అసంతృప్తులు ఉన్నాయని తెలుసు. రెబల్స్‌గా నామినేషన్ వేశారని కూడా తెలుసు. అయినా కూడా.. పార్టీ నాయకులను కేవలం మందలించి వదిలేశారు.
దీనికి కారణం.. వారు చిన్న తప్పులు చేసినా.. పార్టీపరంగా వారి అవసరం చంద్రబాబుకు తెలుసుకాబట్టే. అందుకే.. టీడీపీ బలమైన పోటీ ఇవ్వడమే కాదు.. ఏకపక్ష విజయాలను కూడా నమోదు చేసింది. కొన్ని పాటి అసంతృప్తులు ఉన్నా.. ఎ క్కడా పూర్తిస్థాయిలో పార్టీని పక్కన పెట్టేసి.. ప్రత్యర్థి వర్గంతో చేతులు కలిపేలా రాజకీయాలను గాడి తప్పకుండా చూసుకోవడంలో చంద్రబాబు కొన్ని సార్లు అనేక మెట్లు దిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రతిసారీ ఆయన విజయమే దక్కించుకున్నారు. కానీ, కరాఖండీగా నిర్ణయాలు తీసుకున్న జగన్. నాయకులను దూరం చేసుకుని ప్రతిసారీ పరాజయం పాలవుతూనే ఉన్నారు. సో.. ఇదీ .. చంద్రబాబుకు-జగన్‌కు ఉన్న తేడా!.