అమరావతిపై వైసీపీ ఇక నోరు మెదపదు!

admin
Published by Admin — November 07, 2026 in Andhra
News Image

``ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ చేస్తున్న విమర్శలు, అదేవిధంగా ఆరోపణలు వంటివి ఇంక వదిలేసుకోవాలి`` అనే వాదన పార్టీలోనే కనిపిస్తోంది. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజలు కూటమికే జై కొట్టారు. ముఖ్యంగా గుంటూరులో కార్పొరేషన్ ఎన్నికల విషయంలో స్పష్టమైన మెజారిటీతో పాటు స్పష్టమైన తీర్పు కూడా ఇచ్చారు. దీనిని బట్టి గుంటూరు ప్రజలు సహా విజయవాడ ప్రజల కూడా రాజధాని అమరావతికే అనుకూలంగా ఉన్నారన్నది కూటమి నాయకులు వైసీపీలోని కొంద‌రు నాయ‌కులు కూడా చెబుతున్న మాట.

ఈ నేపథ్యంలో వైసిపి ఇకనైనా అమరావతిపై విమర్శలు చేయటం వ్యంగ్యాస్త్రాలు వదలడం వంటివి మానుకోవాలి అన్నది పరిశీలకులు కూడా సూచిస్తున్నారు. అయినప్పటికీ వైసీపీలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తాజాగా కురిసిన వర్షాలకు అమరావతి మునిగిపోయిందని అమరావతిలోని సీడ్ యాక్సెస్‌ రోడ్ లో నడవడానికి కూడా అవకాశం లేదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది అమరావతి ప్రాంతంలోని రోడ్డు కాదని బంగ్లాదేశ్ నుంచి తీసుకు వచ్చిన వీడియోలను ఇక్కడ ప్రచారం చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు.

అటు వైసిపి చేస్తున్న విమర్శలు, ఇటు ప్రభుత్వం పరంగా ఇస్తున్న వివరణలు పక్కనపెడితే సాధారణ ప్రజలు మాత్రం అమరావతికే అనుకూలంగా ఉన్నామన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయానికి ప్రాతిపదిక స్థానిక సంస్థల ఎన్నికలే అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో వైసిపి నాయకులు చేసిన ఎన్నికల ప్రచారాన్ని చూస్తే అమరావతికి వ్యతిరేకమని మావిగని ప్రాంతాన్ని డెవలప్ చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రజలకు చెప్పారు. తద్వారా ఓట్లు రాబట్టాలని కూడా ప్రయత్నం చేశారు. కానీ దీనికి భిన్నంగా ప్రజలు కూటమికే ఓటేశారు.

అంటే దీనిని బట్టి ప్రజలు మనస్ఫూర్తిగా తమ రాజధాని అమరావతిని కోరుకుంటున్నట్టుగా స్పష్టమైంది. ఇదే సమయంలో మావిగన్ మాట కూడా ప్రజల మనసులోంచి చెరిగిపోయింది. అంటే వైసిపి ఎంత వ్యతిరేక ప్రచారం చేస్తున్నప్పటికీ అమరావతి ప్రాంతం మునిగిపోయిందని వీడియోల సహా ప్రచారం చేస్తున్న కూడా ప్రజలు మాత్రం అమరావతి వైపే ముగ్గు చూపుతున్నారన్నది ఈ ఎన్నికలు తేల్చి చెప్పాయి.

ఈ నేపథ్యంలో అమరావతి తో ఆటలు ఆపేయటం ఇకనైనా మంచిదన్నది వైసిపి లోని సీనియర్ నాయకులు చెబుతున్న మాట.ఈ విషయాన్ని ప్రచారం చేసుకుంటూ పోతే అది వైసిపికి మరిన్ని ఇబ్బందికర పరిస్థితులను తీసుకువస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. మరి ఇప్పటికైనా వైసీపీ అధినేత జగన్ ఈ విషయంలో వెనక్కి తగ్గుతారా లేక మొండిగానే ముందుకు వెళ్తారా అనేది చూడాలి.

Tags
Ycp won't talk about amaravati again
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News