వైసీపీకి సుప్రీం కోర్టు అక్షింతలు!

admin
Published by Admin — October 29, 2026 in Andhra
News Image

ఏపీలో జ‌రుగుతున్న స్థానిక ఎన్నిక‌ల విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది చాల‌ని.. ఇక‌పై తాము జోక్యం చేసుకునేది లేద‌ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ వ్య‌వ‌హారంపై ఇక హైకోర్టుకు కూడా వెళ్లాల్సిన అవ‌స‌రం లేదని పేర్కొంది. ఈ మేర‌కు వైసీపీ నాయ‌కుడు లేళ్ల అప్పిరెడ్డి స‌హా ఇత‌ర నేత‌లు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌పై కోర్టు విచార‌ణ జ‌రిపి.. తాజాగా మంగ‌ళ‌వారం సాయంత్రం తుది ఉత్త‌ర్వులు జారీ చేసింది. స్థానిక ఎన్నిక‌ల స‌మ‌యంలో నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌కుండా అడ్డుకున్నార‌ని.. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌పై స్పందిస్తూ.. ఇప్ప‌టికే దీనిపై త‌గు ఆదేశాలు జారీ చేశామ‌నికోర్టు వ్యాఖ్యానించింది.

ఇంత‌కు మించి ఎన్నిక‌ల ప్ర‌క్రియలో జోక్యం చేసుకోలేమ‌ని కోర్టు తెలిపింది. నామినేష‌న్ల దాఖ‌లుకు స‌మ‌యం పొడిగించిన విష‌యంపై ఎన్ని క‌ల సంఘం త‌ర‌ఫు న్యాయ‌వాది చేసిన వాద‌న‌ల‌తో కోర్టు ఏకీభ‌వించింది. ఇక‌, నామినేషన్ల స‌మయంలో చోటు చేసుకున్న హింస‌పై ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు కేసులు న‌మోదు చేసిన‌ట్టు ప్ర‌భుత్వం త‌ర‌ఫు న్యాయ‌వాది సిద్ధార్థ్ లూథ్రా వాద‌న‌లు వినిపించారు. ఈ క్ర‌మంలో ఇంక‌.. చేయాల్సింది ఏమీలేద‌ని కోర్టు పేర్కొంది. దీనిపై హైకోర్టును కూడా ఆశ్ర‌యించాల్సిన అవ‌స‌రం ఏముంటుంద‌ని ప్ర‌శ్నించింది. అయితే.. ఏదైనా అభ్యంత‌రాలు ఉంటే.. వాటిని ఎన్నిక‌ల ప్ర‌త్యేక కోర్టును ఆశ్రయించాల‌ని పేర్కొంది.

ఇక‌, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక‌లు పూర్త‌యిన త‌ర్వాత‌.. తాము చెప్పే వ‌ర‌కు సీసీ టీవీ ఫుటేజీని భ‌ద్ర‌పర‌చాల‌ని పేర్కొంది. అలానే.. ఎన్నిక‌లు స‌జావుగా, స్వేచ్ఛ‌గా జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొంది. కేంద్ర బ‌ల‌గాల విష‌యంలో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఓట‌ర్ల జాబితాను ముందుగానే నిర్ధారించిన నేప‌థ్యంలో పోలింగ్ స‌మ‌యానికి ఎవ‌రైనా కొత్త ఓట‌ర్లు ఉంటే వారికి కూడా ఓటు హ‌క్కు క‌ల్పించాల‌ని ఆదేశించింది. ఈ విష‌యంలో ఎన్నిక‌ల సంఘం నిష్పాక్షికంగా వ్య‌వ‌హ‌రించాల‌ని తెలిపింది. ఇంత‌కు మించి ఈ విష‌యంలో కోర్టులు జోక్యం చేసుకునేది లేద‌ని పేర్కొంది.

త‌ర్వాత ఏంటి?

తాజా సుప్రీంకోర్టు ఆదేశాల‌పై వైసీపీ నిరుత్సాహంలో మునిగిపోయింది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను వాయిదా వేయాల‌ని.. నామినేష‌న్ల‌కు మ‌రింత గ‌డువు పెంచాల‌న‌న త‌మ అభ్య‌ర్థ‌ల‌ను కోర్టు తోసిపుచ్చిన నేప‌థ్యంలో దీనిపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వైసీపీ త‌ర‌ఫున న్యాయ వాదులు పేర్కొన్నారు. అవ‌స‌ర‌మైతే.. ఎన్నిక‌ల పిటిష‌న్లు దాఖ‌లు చేస్తామ‌న్నారు. మ‌రోవైపు.. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాద‌న‌లు వినిపిం చిన న్యాయ‌వాదులు.. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను అడ్డుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా వైసీపీ నేత‌లు పిటిష‌న్లు వేశార‌ని.. అంతా స‌జావుగానే సాగుతోంద‌ని తెలిపారు. ప్ర‌తి చిన్న విష‌యాన్నీ వైసీపీ రాజ‌కీయం కోసం వినియోగించుకుంటోంద‌ని కోర్టుకు వివ‌రించారు.

Tags
Supreme court angry ycp local body elections
Recent Comments
Leave a Comment

Related News