ఏపీ పరిషత్ పోరు.. 2 రోజులు ఇవ‌న్నీ బంద్‌.!

admin
Published by Admin — November 02, 2026 in Politics, Andhra
News Image

మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో రాజకీయం మరో మలుపు తిరిగింది. రాష్ట్ర యంత్రాంగం ఇప్పుడు పూర్తిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ నిర్వహణపైనే దృష్టి సారించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా విడుదల చేసిన సవరించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 5న ఈ పరిషత్ సమరానికి పోలింగ్ జరగనుంది. ఓటింగ్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా పూర్తి చేసేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ మహా సమరంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు పాఠశాలలతో పాటు పోలింగ్(Polling) కేంద్రాలుగా వ్యవహరించే ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మొదటి రోజు ఏర్పాట్లకు, రెండో రోజు ప్రత్యక్ష పోలింగ్‌కు ఈ సెలవులు వర్తిస్తాయి.

కేవలం సర్కారీ ఉద్యోగులకే కాకుండా, ప్రైవేట్ రంగానికి కూడా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. పోలింగ్ జరిగే పరిధిలోని ప్రైవేట్ సంస్థలు, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో పనిచేసే సిబ్బందికి నవంబర్ 5న వేతనంతో కూడిన సెలవు (Paid Leave) తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

వాస్తవానికి ఈ పోలింగ్ నవంబర్ 3నే ముగియాల్సి ఉన్నప్పటికీ, మున్సిపల్ షెడ్యూల్‌లో వచ్చిన సాంకేతిక మార్పుల కారణంగా రెండు రోజులు వాయిదా పడింది. నవంబర్ 5న ఉదయం నుంచే ఓటింగ్ ప్రారంభం కానుండగా, నవంబర్ 7న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక‌పోతే ఈసారి పరిషత్ పోరు అత్యంత రసవత్తరంగా మారనుంది. మొత్తం 9,829 ఎంపీటీసీ(MPTC) స్థానాల కోసం 46,045 మంది, 659 జెడ్పీటీసీ(ZPTC) స్థానాల కోసం 4,770 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన పార్టీలైన అధికార, ప్రతిపక్షాలతో పాటు స్వతంత్రులు కూడా భారీగా బరిలో దిగడంతో పల్లె పోరు సంచలనంగా మారింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Tags
AP Govt Holidays AP Elections AP Local Body Elections MPTC ZPTC AP News Andhra Pradesh
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News