ఏపీకి మ‌రో ముప్పు.. బాబు రెస్ట్‌లెస్‌!

admin
Published by Admin — November 01, 2026 in Politics
News Image

ఏపీలో ఆర్న‌బ్ తుఫాను సృష్టించిన బీభ‌త్సం నుంచి ప్ర‌జ‌లు ఇంకా తేరుకోలేదు. ప్ర‌జ‌లే కాదు.. ప్ర‌భుత్వం కూడా ఇంకా కుదుట ప‌డ‌లేదు. సీఎం చంద్ర‌బాబు ఇంకా నిరంత‌రం స‌మీక్ష‌లుచేస్తూనే ఉన్నారు. పున‌రావాస కేంద్రాల్లోని వారికి భ‌రోసా ఇస్తూనే ఉన్నారు. ఆర్న‌బ్ తుఫాను కార‌ణంగాజ‌రిగిన న‌ష్టంపై అంచ‌నాలు వేయిస్తున్నారు. కేంద్రం నుంచివ‌చ్చిన బృందాలు.. కూడా జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు రెడీ అయ్యాయి. ఇలా.. ఆర్న‌బ్ తుఫాను ఎఫెక్ట్ నుంచి కోలుకోక ముందే.. మ‌రో తుఫాను ఏపీని వ‌ణికించేందుకురెడీ అయింద‌న్న వార్త‌లు అంద‌రినీ ఇర‌కాటానికి గురి చేస్తున్నాయి. ఈ విష‌యంలో చంద్ర‌బాబు మ‌రింత ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఉమ్మ‌డి విశాఖ‌, తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలు ఆర్న‌బ్ తుఫాను ప్ర‌భావానికి భారీ గా దెబ్బ‌తిన్నాయి. అయితే.. తాజాగా బంగాళా ఖాతంలో మ‌రో తుఫాను పొంచి ఉంద‌ని.. ఆదివారం సాయంత్రం నాటికి ఏపీపై తీవ్ర ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంద‌ని అధికారులు వెల్ల‌డించారు. దీని ప్ర‌భావంతో ఉమ్మ‌డి ఉత్త‌రాంధ్ర‌, విశాఖ‌, తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌కు మ‌రో ప్ర‌మాదం త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని అంచ‌నా వేశారు. దీంతో సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ అలెర్ట్ అయ్యారు. ఆదివారం ఎన్నిక‌ల పోలింగ్ ఉన్న‌ప్ప‌టికీ.. తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల‌పై దృష్టి పెట్టాల‌ని అధికారుల‌కు సూచించారు. ఆర్న‌బ్ తుఫాను ప్ర‌భావానికి ముందు ఎలా ప‌నిచేశారో.. ఇప్పుడు కూడా అలానే ప‌నిచేయాల‌న్నా రు.

ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు ఆర్జీజీఎస్ కేంద్రంలోనే తిష్ట వేశారు. రానున్న 12 గంటల్లో బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం.. తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశముందని చెప్పిన చంద్ర‌బాబు.. అధికారులు మ‌రింత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. అలానే జిల్లాల్లో మంత్రులు ఎన్నిక‌ల‌తోపాటు స్థానిక ప‌రిస్థితుల‌పైనా దృష్టి పెట్టాల‌న్నారు. ఆదివారం సాయంత్రానికి తుపానుగా మారి.. తీర ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనావేస్తోందన్న ఆయ‌న‌..ఎలాంటి విప‌త్తు సంభ‌వించినా ప్రాణ న‌ష్టం జ‌ర‌గ కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని తేల్చి చెప్పారు. ఇప్ప‌టికే పున‌రావాస కేంద్రాల్లో ఉన్న‌వారిని అలానే కొన‌సాగించాల‌ని సూచించారు.

ఒక‌వేళ ఎవ‌రైనా పున‌రావాస కేంద్రాల‌నుంచి వెళ్లిపోయి ఉంటే.. వారిని తిరిగి తీసుకురావాల‌ని.. ప్రాణ న‌ష్టం జ‌ర‌గడానికి వీల్లేద‌ని తేల్చి చెప్పారు. ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. క‌లెక్ట‌ర్లు, ఆర్డీవోలు అందుబాటులో ఉండాల‌న్నారు. ఎన్నిక‌ల విధుల్లో ఉన్న‌వారు త‌ప్ప‌.. మిగిలిన వారిని త‌ప్ప‌నిసరిగా తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల్లో విధుల‌కు కేటాయించాల‌ని సూచించారు. అంద‌రికీ సెల‌వులు ర‌ద్దు చేయాల‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. మొత్తంగా.. ఆర్న‌బ్‌తో పూర్తిస్థాయి స‌మ‌యం కేటాయించిన చంద్ర‌బాబు.. ఇప్పుడు పొంచి ఉన్న మ‌రో తుఫానుతో మ‌రింత‌గా క‌ష్ట‌ప‌డాల్సి రావ‌డం గ‌మ‌నార్హం.

Tags
Cm chandrababu handle cyclone Another
Recent Comments
Leave a Comment

Related News