టాలీవుడ్ కొత్త ట్రెండ్.. డేట్ ఇస్తారు.. మాయం చేస్తారు!

admin
Published by Admin — September 05, 2026 in Movies
News Image

ఒకప్పుడు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే చాలు, పండగ వాతావరణం నెలకొనేది. ఫ్యాన్స్ క్యాలెండర్లలో ఆ తేదీని సర్కిల్ చేసుకుని ఎదురుచూసేవారు. కానీ, టాలీవుడ్‌(Tollywood)లో ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. పోస్టర్ మీద అక్షరాలు పడడమే తరువాయి.. ఆ డేట్ కాస్తా మాయమైపోవడం కామన్ అయిపోయింది. "ఎప్పుడు వస్తుంది?" అనేదానికంటే, "ఈసారైనా వస్తుందా?" అనే అనుమానమే ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది.

తాజా పరిణామాలు చూస్తుంటే టాలీవుడ్‌లో రిలీజ్ డేట్స్ అనేవి కేవలం ఒక తాత్కాలిక కమిట్‌మెంట్ లా మారిపోయాయనిపిస్తోంది. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 24న రావాల్సిన 'ది ప్యారడైజ్' మళ్లీ వాయిదా బాట పట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో నాని(Nani) సినిమా మరోసారి డేట్ మార్చుకోవాల్సి వస్తోందని టాక్.

ఇక రజనీకాంత్ 'జైలర్ 2(Jailer 2)' లేదా విజయ్ దేవరకొండ, రష్మికల 'రణబాలి' లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. అక్టోబర్ సీజన్‌ను టార్గెట్ చేసిన ఈ సినిమాల రిలీజ్ డేట్లపై ఎప్పుడూ ఒకటే ఉత్కంఠ, టెన్షన్. ఇక వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న 'ఆదర్శ కుటుంబం - హౌస్ నంబర్ 47' కూడా కీలక ఎపిసోడ్ల రీషూట్ కారణంగా దసరా రేసు నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

అసలు ఈ వాయిదాల పర్వానికి కారణమేంటి? కేవలం షూటింగ్స్ లేటవ్వడమేనా? అంటే కాదనే చెప్పాలి. వీఎఫ్‌ఎక్స్ పనులు, పర్ఫెక్ట్ అవుట్‌పుట్ కోసం క్వాలిటీతో రాజీ పడకూడదనే ఆలోచన ఒకెత్తయితే.. మరోవైపు పండగ సీజన్లు, సోలో రిలీజ్ విండోస్ దొరకకపోవడం, థియేటర్ల సర్దుబాటు వంటి లెక్కలన్నీ కలిపి మేకర్స్‌ను ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. కారణాలు ఏవైనా సరే.. ఇలా పదే పదే డేట్లు మార్చడం వల్ల సినిమాపై ఉన్న బజ్ కాస్తా ప్రేక్షకుల్లో అయోమయంగా మారుతోంది. ప్రమోషన్ల జోరు పెంచే సమయానికి వాయిదా వార్తలు వస్తుండటంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. మొత్తానికి చూస్తే, టాలీవుడ్‌(Tollywood)లో ఇప్పుడు రిలీజ్ డేట్ కార్డ్స్ చూసి మురిసిపోవడం కంటే.. థియేటర్‌లో సినిమా పడే వరకు నమ్మకపోవడమే బెటర్ అనిపిస్తోంది!

Tags
Tollywood Movie Postponed Telugu Cinema Release Date Tollywood Buzz Nani
Recent Comments
Leave a Comment

Related News