మెగా ఫ్యాన్స్‌కు షాక్‌.. ` విశ్వంభ‌ర` ఇక లేన‌ట్లే.!

admin
Published by Admin — August 24, 2026 in Movies
News Image

మెగాస్టార్ చిరంజీవి(MegaStar Chinjeevi) కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ ఫాంటసీ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ చుట్టూ ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇటీవల చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్ మాత్రం అందులో కనిపించలేదు. ఈ దసరాకే సినిమా థియేటర్లలోకి వస్తుందని అందరూ భావించినా, మేకర్స్ ఆ దిశగా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం మెగా సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

షూటింగ్ ఎప్పుడో పూర్తయినా, విశ్వంభర (Vishwambhara) విడుదలకు ప్రధాన అడ్డంకిగా విజువల్ ఎఫెక్ట్స్ మారినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఫాంటసీ జానర్ కావడంతో సీజీ వర్క్‌కు అత్యంత ప్రాధాన్యత ఉంది. అయితే అనుకున్న టైంకి ఆ వర్క్స్ పూర్తి కాకపోవడం, ఇంకా చాలా భాగం పెండింగ్‌లో ఉండటంతో చిత్రబృందం తలలు పట్టుకుంటోంది. ఆ గ్రాఫిక్స్ పనులు ఎప్పటికి కొలిక్కి వస్తాయో, ఆ తర్వాత జరిగే కరెక్షాన్స్‌కు ఎంత సమయం పడుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.

ఒకవేళ దసరా రేసు నుంచి సినిమా తప్పుకుంటే, ఈ ఏడాదిలో మరో అవకాశం దక్కడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. రాబోయే సంక్రాంతి సీజన్‌కు మెగాస్టార్ మరో సినిమా ‘కాకా(Kaaka) ’ ఇప్పటికే కర్చీఫ్ వేసేసింది. ఒకే సీజన్‌లో రెండు మెగా సినిమాలు వస్తే క్రేజ్ దెబ్బతింటుందనే వాదన కూడా ఉంది. ఒకవేళ సంక్రాంతి రేసు కూడా మిస్ అయితే, ఇక 2027 వేసవి వరకు ‘విశ్వంభర’ కోసం వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా, టెక్నికల్ వర్క్స్ కారణంగా మెగాస్టార్ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ఇలా సైలెంట్ అయిపోవడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

Tags
Vishwambhara Megastar Chiranjeevi Chiranjeevi Tollywood Vishwambhara Release Date Mega Fans
Recent Comments
Leave a Comment

Related News