కొండా ఫ్యామిలీ లొల్లి.. రేవంత్ ఫ‌స్ట్ రియాక్ష‌న్ వైర‌ల్‌!

admin
Published by Admin — August 24, 2026 in Politics, Telangana
News Image

తెలంగాణ(Telangana) రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన కొండా కుటుంబ వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పార్టీలో క్రమశిక్షణే ప్రాతిపదికగా ఉంటుందని స్పష్టం చేయడం రాజకీయ సర్కిల్స్‌లో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల జరిగిన ఒక వేడుకలో మంత్రి కొండా సురేఖ(Konda Surekha) కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం, ఆమె లిఖితపూర్వక వివరణ ఇవ్వడం వేగంగా జరిగిపోయాయి.

ఈ పరిణామాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)  చాలా స్పష్టంగా బదులిచ్చారు. పార్టీలో ఎవరైనా సరే అధిష్ఠానం గీత దాటితే ఊరుకునేది లేదని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉందని, కమిటీ నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని తేల్చిచెప్పారు. అంతర్గత విషయాలను ఎవరికీ నచ్చినట్లు వారు రోడ్డకెక్కించడం సరైన పద్ధతి కాదని, పార్టీ వేదికలపైనే చర్చించుకోవాలని సూచించారు.

మరోవైపు, ఈ వివాదంపై సోషల్ మీడియాలో వస్తున్న ఊహాజనిత కథనాలు, నిరాధార వార్తలను నమ్మవద్దని సీఎం కోరారు. క్రమశిక్షణ కమిటీ, పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతి ఒక్కరూ దానికి కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఈ ఇష్యూపై ఎలాంటి మెతక వైఖరి ఉండబోదని సంకేతాలు పంపారు. మొత్తానికి, రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ స్ట్రాంగ్ కౌంటర్ తో కొండా ఫ్యామిలీ(Konda Family) లొల్లి పాలిటిక్స్‌లో మరింత హీట్ పెంచింది.

Tags
Konda Surekha Revanth Reddy Telangana Politics Congress Konda Susmitha TPCC
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News