కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి.. ముహూర్తం ఫిక్స్‌..!

admin
Published by Admin — July 13, 2026 in Movies
News Image

కోలీవుడ్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander), సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్‌ల లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ వస్తున్న ఊహాగానాలకు ఇప్పుడు మరింత బలం చేకూరింది. ఎట్టకేలకు ఈ క్రేజీ కపుల్ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి గట్టి సమాచారం అందుతోంది. తమిళనాడులోని ఇరు పెద్ద కుటుంబాలకు చెందిన ఈ జంట వివాహ బంధంతో ఒకటి కాబోతుండటం సినీ, క్రీడా రంగాల్లో సంచలనం రేపుతోంది.

సాధారణంగా ఇలాంటి సెలబ్రిటీ పెళ్లి వార్తలపై రకరకాల రూమర్స్ వస్తుంటాయి. కానీ, ఈసారి అనిరుధ్ సొంత బంధువు, సీనియర్ నటుడు వైజీ మహేంద్ర స్వయంగా ఈ విషయంపై స్పందించడంతో ఈ వార్తలకు అధికారిక ముద్ర పడినట్లయింది. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అనిరుధ్, కావ్య మారన్ లవ్ మ్యాటర్ నిజమేనని, వారిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని కన్ఫర్మ్ చేశారు. కోట్ల విలువైన ఐపీఎల్ టీమ్‌ను సమర్థవంతంగా నడిపిస్తున్న కావ్య(Kavya), అనిరుధ్‌కు పర్‌ఫెక్ట్ జోడీ అంటూ ఆయన ప్రశంసలు కురిపించారు.

అయితే ఇప్పుడు ఈ స్టార్ కపుల్ పెళ్లి ముహూర్తంపై కూడా సోషల్ మీడియాలో రకరకాల డేట్స్ వైరల్ అవుతున్నాయి. కొందరు ఈ ఏడాది నవంబర్‌లోనే వీరి పెళ్లి జరుగుతుందని అంటుంటే.. మరికొందరు మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'జైలర్ 2(Jailer 2)' విడుదల తర్వాతే ఈ శుభకార్యం ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం అనిరుధ్ ఈ సినిమా ఆల్బమ్‌తో పాటు షారుఖ్ ఖాన్ 'కింగ్' చిత్రానికి సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్స్ కాస్త కొలిక్కి రాగానే, ఈ ఏడాది చివర్లో గ్రాండ్‌గా వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ టాక్. ఏదేమైన‌ప్ప‌టికీ ఈ పెళ్లి ముహూర్తం వార్తలపై ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఈ ఏడాది సౌత్ ఇండియాలోనే ఇది బిగ్గెస్ట్ సెలబ్రిటీ వెడ్డింగ్ కావడం ఖాయం.

Tags
Anirudh Ravichander Kavya Maran Anirudh Kavya Wedding Sunrisers Hyderabad SRH Jailer 2
Recent Comments
Leave a Comment

Related News