తన క్లాసిక్ లుక్స్‌తోనే కాకుండా.. గాల్లో తేలేలా చేసే అదిరిపోయే స్టెప్పులతో టాలీవుడ్(Tollywood)ను ఊపేస్తోంది యంగ్ అండ్ ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీల. వరుస ప్రాజెక్టులతో టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా తన పర్సనల్ లైఫ్, పెళ్లి గురించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. సాధారణంగా సెలబ్రిటీలు తమ రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడటానికి అంతగా ఇష్టపడరు. కానీ శ్రీలీల మాత్రం తనకు కాబోయే లైఫ్ పార్ట్‌నర్ ఎలా ఉండాలో చాలా ఓపెన్‌గా, క్లారిటీగా చెప్పేసింది.
సాధారణంగా గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న హీరోయిన్స్ అనగానే.. తమకు కాబోయే వాడు హ్యాండ్‌సమ్‌గా ఉండాలని, బాగా రిచ్‌గా ఉండాలని కోరుకుంటారని అందరూ అనుకుంటారు. కానీ శ్రీలీల(Sreeleela) ఆలోచనలు మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. తనకు కేవలం అందం, హోదా మాత్రమే ముఖ్యం కాదని.. అంతకంటే పెద్ద క్వాలిటీ ఒకటి తన పార్ట్‌నర్‌లో ఉండాలని ఈ బ్యూటీ స్పష్టం చేసింది.
శ్రీలీల(Sreeleela) మనసు దోచుకోవాలంటే ఆ వ్యక్తిలో ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ.. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్. జీవితాన్ని సరదాగా నవ్వూతూ సాగించే గుణం, ఎదుటివారి ముఖంలో నవ్వులు పూయించే టాలెంట్ అతనికి కచ్చితంగా ఉండాలట. నవ్వుతూ, నవ్విస్తూ ఉండే వాళ్లంటే తనకు చాలా ఇష్టమని ఈ బ్యూటీ హింట్ ఇచ్చేసింది. కేవలం నవ్వించడమే కాదు.. ఎదుటివారి భావాలను, ఇష్టాలను గౌరవించే సెన్సిటివ్ మనస్తత్వం కూడా ఉండాలని చెప్పింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం, ఇతరుల పట్ల దయా హృదయం ఉన్నవాడే తనకు కాబోయే భర్త అని తేల్చి చెప్పేసింది. కాగా, ప్రస్తుతం శ్రీలీల చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.