అమెరికాలోని శాన్ రామన్‌లోని బిషప్ రాంచ్‌లో AIA ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్రేట్ ఇండియన్ ఫుడ్ & షాపింగ్ ఫెస్ట్ & మ్యాంగో ఫెస్టివల్’ విజయవంతంగా ముగిసింది. బే ఏరియా నలుమూలల నుంచి 15 వేల మందికి పైగా ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, వంటకాలు, వినోదం, షాపింగ్ మరియు కమ్యూనిటీ స్ఫూర్తిని ఈ కార్యక్రమం ప్రతిబింబించింది. రంగులు, రుచులు, సంగీతం, కుటుంబాల మధ్య ఆప్యాయ కలయికలతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమం ప్రాంగణమంతా ఉత్సాహంతో నిండిపోయింది.
గ్రాండ్ స్పాన్సర్: సంజీవ్ గుప్తా CPA
ప్లాటినం స్పాన్సర్: రియల్టర్ లావణ్య దువ్వి
ట్రావెల్ పార్టనర్: Travelopod
పవర్డ్ బై: రియల్టర్ నాగరాజ్ అన్నయ్య
ఇతర స్పాన్సర్లు: Sierra Pacific PW, Insta Service, Azad Financials, Vachi Silks, Apex, Kavya Foods, My Pursu, రియల్టర్ శిఖా కపూర్, Deeksha Boutiq, Bhanu Mangoes & AnuGraha Farms.
మ్యాంగో ఫెస్టివల్ ఈ సంవత్సరపు వేడుకలలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మామిడి సీజన్‌లో వివిధ రకాల మ్యాంగో డిజర్ట్స్, పానీయాలు, మిఠాయిలు, స్పెషల్ వంటకాలను ఆహూతులు ఆస్వాదించారు.
ఈ సందర్భంగా నార్త్ అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ రిప్రజెంటేటివ్ జయరాం కోమటిని ఏఐఏ సత్కరించింది. తనను ఆ పదవిలో నియమించడం గర్వకారణంగా ఉందని జయరాం కోమటి అన్నారు. సమాజ సేవకు కృషి చేస్తూ అమెరికా, ఆంధ్రప్రదేశ్, భారత్ ల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ ఫెస్టివల్‌కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
నాహస్ అలి (భారత కాన్సుల్ జనరల్, సాన్ ఫ్రాన్సిస్కో)
ఎలిసా మార్క్వెజ్ (సూపర్‌వైజర్, అలమెడా కౌంటీ)
ఉర్సులా జోన్స్ డిక్సన్ (డిస్ట్రిక్ట్ అటార్నీ, అలమెడా కౌంటీ)
మారిసోల్ రుబియో (వైస్ మేయర్, శాన్ రామన్)
శ్రీధర్ వెరోస్ (కౌన్సిల్ మెంబర్, సాన్ రామన్)
మెలిస్సా హెర్నాండెజ్ (BART బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్)
ఈవాన్ బ్రాన్నింగ్ (కౌన్సిల్ మెంబర్, లివర్‌మోర్)
బెన్ బారియెంటోస్ (కౌన్సిల్ మెంబర్, లివర్‌మోర్)
ఈ ఫెస్టివల్‌లో 100కి పైగా విక్రేతలు భారతీయ & అంతర్జాతీయ వంటకాలు, దుస్తులు, ఆభరణాలు, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫ్యాషన్, హస్తకళలు, ఆర్ట్, హోమ్ డెకర్, చిరు వ్యాపారాలతో పాల్గొన్నారు. బే ఏరియాలోని వ్యాపారులకు, ఎంట్రప్రెన్యూర్లకు ఈ ఈవెంట్ గొప్ప వేదికగా మారింది. స్థానిక డాన్స్ గ్రూపులు, సంగీత ప్రదర్శనలు (EBK & BATA/AIA కరోకే టీమ్స్), DJ ఎంటర్‌టైన్‌మెంట్, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మదర్స్ డే స్పెషల్ “సారీ ప్రొమినేడ్” విజయవంతమైంది. కార్నివాల్ రైడ్స్, గేములు, కుటుంబాలకు అనువైన కార్యకలాపాలు అందరినీ ఆకర్షించాయి.
AIA సంస్థ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న TGIFS Fest బే ఏరియాలో అత్యంత ఆసక్తికరమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. భారతీయ సంస్కృతిపై అవగాహన, సమగ్రత, స్థానిక వ్యాపారాల మద్దతును ఏఐఏ ప్రోత్సహిస్తోంది.
వేలాది కుటుంబాలు, సమాజ సభ్యులు, నాయకులు అందరూ ఒకే వేదికపై సంస్కృతి, వైవిధ్యం, ఐక్యతను సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకమని AIA ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారితోపాటు స్పాన్సర్లు, విక్రేతలు, ప్రదర్శకులు, వాలంటీర్ల అందరి మద్దతుతో ఈ ఏడాది ఫెస్టివల్ విజయవంతమైందని, అందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
అమెరికాలో నివసిస్తున్న భారతీయ అమెరికన్ కమ్యూనిటీకి భారతీయ సంస్కృతి, వారసత్వం గురించి చర్చించేందుకు అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఒక చక్కని వేదికను అందిస్తున్న ఎన్ జీవో. సాంస్కృతిక మరియు సామాజిక పరిచయాలను ప్రోత్సహించడం AIA లక్ష్యం. భారత ఉపఖండానికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు మరియు విద్యా కార్యక్రమాలను నిర్వహించడం, భారత ఉపఖండంలోని విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని, సంస్కృతిని సభ్యులతో పంచుకోవడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యాలు. సిలికాన్ వ్యాలీలో 50కి పైగా వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల సమూహం ఈ ఏఐఏ.