డబ్లిన్ లో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న శ్రీనివాస్ మిరియాల

admin
Published by Admin — October 16, 2026 in Nri
News Image

ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, జనసేన నేత శ్రీనివాస్ మిరియాల అమెరికాలోని వివిధ నగరాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే బే ఏరియా జనసేన, ఏపీఎన్నార్టీ కమ్యూనిటీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నారై వీరబాబు ప్రత్తిపాటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వర్కింగ్ డే అయినప్పటికీ ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో టీడీపీ, జనసేనకు చెందిన ఎన్నారై నేతలు, పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు.

ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాల గురించి శ్రీనివాస్ మిరియాల ప్రసంగించారు. టెక్నాలజీ, సృజనాత్మకతలకు ఏపీ ఎప్పుడూ పెద్దపీట వేసిందని చెప్పారు. స్టార్టప్ కంపెనీలకు, సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలు పెట్టేందుకు ఏపీ స్వర్గధామమని అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాలిఫోర్నియాలోని డబ్లిన్ లో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నారైలు పాల్గొని పలు విషయాలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో పలువురు ఏపీ ఎన్నార్టీ కో ఆర్డినేటర్లు, కూటమి పార్టీలకు చెందిన ఎన్నారైలు వీరబాబు ప్రత్తిపాటి, సాగర్ దొడ్డపనేని శ్రీకాంత్ దొడ్డపనేని, శశి దొప్పలపూడి, మురళీ గూడవర్తి, వెంకట్ అడుసుమల్లి, సురేష్ పోతినేని, చిమటా శ్రీనివాస్, రెడ్డయ్య ప్రత్తిపాటి, శివ మొలబంతి, అనిల్ అరిగె, శ్రీకాంత్ కంచన, దుర్గా పెద్దిరెడ్డి, వీర దాడి, సుబ్బు పప్పుల, రావు చెన్న, కిరణ్ విన్నకోట తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

Tags
Special representative of ap government in North America srinivas miriyala particcipated in community interaction in Dublin
Recent Comments
Leave a Comment

Related News

Latest News