సౌదీ అరేబియాలో ఘనంగా మహానాడు

admin
Published by Admin — May 16, 2026 in Nri
News Image

సౌదీ అరేబియాలో తెలుగుదేశం గల్ఫ్ కౌన్సిల్ ఇచ్చిన పిలుపుకు తెలుగు ప్రవాసీ లోకం కదిలి వచ్చింది. శుక్రవారం సౌదీ అరేబియాలోని దమ్మాంలో ఎన్నారై తెలుగుదేశం పార్టీ సౌదీ శాఖ అట్టహాసంగా నిర్వహించిన మహానాడుకు దేశంలోని సదూర ఎడారి ప్రాంతాల నుండి పార్టీ అభిమానులు ఉత్సహాంతో కదం తొక్కుతూ చేరుకోన్నారు. 1700 కిలో మీటర్ల దూర ప్రాంతాల నుండి కూడ పార్టీ అభిమానులు వచ్చారు. 

గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రావి రాధాకృష్ణా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం పార్టీ కార్యక్రమం కంటె ఎక్కువగా తెలుగు కుటుంబాల ఆత్మీయ కలయికగా జరిగింది. విజయవాడ నుండి ప్రత్యెకంగా వచ్చిన పెనమలూరు శాసన సభ్యుడు బోడె ప్రసాద్ మరియు తెలుగు దేశం పార్టీ నాయకుడు మహాసేన రాజేశ్ లు ప్రత్యెక ఆకర్షణగా నిలిచారు. బాహ్య అభిప్రాయానికి విభిన్నంగా సౌదీ అరేబియా ఉందని బోడె ప్రసాద్ అన్నారు

విడియో కాల్ ద్వారా మాట్లాడుతూ సౌదీ అరేబియాలోని తెలుగు దేశం బృందాన్ని ప్రశంసించారు. చిత్తూరు జిల్లా పలమనేరు శాసనసభ్యుడు యన్. అమర్నాథ్ రెడ్డి, పార్టీ నాయకుడు సుఖవాసిలు కూడ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.

గాయకులు రఘు కుంచె మరియు మాలవికా తమ మధుర గేయాలతో మైమరపించారు. తెలుగుదేశం పార్టీకు బలమైన కంచుకోటగా భావించె రియాధ్ నగరం నుండి ప్రత్యెక బస్సులలో మహిళలు, చిన్నారులు సైతం 500 కిలోమీటర్ల దూరంలోని దమ్మాంలోని సభావేదిక వద్దకు చేరుకోన్నారు. పార్టీ నాయకుడు వడ్లమూడి సారథినాయుడు అధ్వర్యంలో సుప్రభాతం పూజకు లేచినట్లుగా తెల్లవారు జామున 4 గంటలకు లేచి దమ్మాంకు బయలుదేరారు. పారిశ్రామిక నగరం జుబైల్ నుండి పార్టీ అభిమానులు కూడ చురుక్కుగా పాల్గోన్నారు. 

జోర్డాన్ సరిహద్దులోని తబూక్ నుండి 1700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చిన రోహన్ కుమార్ మరియు 1200 కిలోమీటర్ల దూరంలోని జెద్ధా నుండి వచ్చిన శివ రామకృష్ణలు తెలుగుదేశం మీద ఉన్న అభిమానానికి తార్కాణంగా నిలిచారు. పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ కార్యకర్తలకు రియాధ్ తెలుగుదేశం బృందం సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి.

గత రెండు రోజులుగా నిద్రాహారాలు లేకుండా కార్యక్రమ నిర్వహణలో నిమగ్నమైనప్పటికి జానీ బాషా, రాజశేఖర్, ఖాలీద్ సైఫుల్లా, కోగంటి శ్రీనివాస రావు, భరద్వాజ్, చంద్రశేఖర్, భాను ప్రకాశ్, చెన్నుపాటి నరేష్, గడ్డం శిల్పా, మండవ అక్షితలు వచ్చిన కార్యకర్తలను అప్యాయతంగా పలకరించి స్వాగతించారు.

అతిథ్య రెస్టారెంట్ వడ్డించిన సంప్రదాయక తెలుగు వంటకాల రుచులను సభికులు ఆస్వాదించారు.

పార్టీ ప్రతినిధులు రంజిత్, సత్తిబాబు, ముజ్జమ్మీల్, సతీశ్ తదితరులు భోజనాలను వడ్డించారు. 

విజయవాడ విమాశ్రాయానికి సౌదీ అరేబియా మరియు ఇతర గల్ఫ్ దేశాల నుండి నేరుగా విమాన సౌకర్యం కల్పించాలని, ఇందుకు ప్రతి ఒక్క ప్రవాసాంధ్రుడు తమ బాధ్యతగా గల్ఫ్ లోని ఏయిర్ లైన్సలను ఒప్పించాలని తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా అధ్యక్షుడు ఖాలీద్ సైఫుల్లా చేసిన సూచనకు మహానాడు తీర్మాణంగా ఆమోదించింది.

News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
Tags
Saudi Arabia finished in grand style mahanadu NRI TDP
Recent Comments
Leave a Comment

Related News