సినిమాల‌కు బ్రేక్‌.. ప‌వ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం!

admin
Published by Admin — May 15, 2026 in Movies
News Image

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం రాజకీయంగా, పరిపాలనాపరంగా ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే ఆయనకు సైనస్ శస్త్రచికిత్స జరగడం, ఆ తర్వాత ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోకుండానే ప్రజా క్షేత్రంలో యాక్టివ్‌గా మార‌డం చూస్తేనే ఉన్నాం. అయితే, పవన్ కల్యాణ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. తన ఆరోగ్యం, రాజకీయ బాధ్యతల దృష్ట్యా సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

గతంలో వరుస సినిమా షూటింగ్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్ ల సమయంలో తనకు తగిలిన పలు గాయాలను ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చేయడం వల్లే ఇప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని పవన్ భావిస్తున్నారు. సైనస్ సర్జరీ(Sinus Surgery) నుంచి కోలుకుంటున్నప్పటికీ, పాత గాయాల ప్రభావం శరీరంపై పడకుండా ఉండాలంటే కొంతకాలం పాటు భారీ శారీరక శ్రమకు దూరంగా ఉండాలని డాక్టర్లు కూడా సూచించినట్లు సమాచారం.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్‌పై భారీ బాధ్యతలు ఉన్నాయి. నిరంతర సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన నిమగ్నమై ఉన్నారు. ఈ రోజువారీ ఒత్తిడికి తోడు, మళ్లీ వెంటనే సినిమా షూటింగ్స్ లాంటి హెవీ షెడ్యూల్స్ పెట్టుకుంటే ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదం ఉందని ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు హెచ్చరిస్తున్నారు. అందుకే, ఆరోగ్యం పూర్తిగా కుదుటపడే వరకు లైట్లు, కెమెరాలకు దూరంగా ఉండటమే మంచిదనే అభిప్రాయానికి పవన్ వచ్చినట్లు టాక్.

Tags
Pawan Kalyan Deputy CM Pawan Kalyan JanaSena Andhra Pradesh AP Politics Tollywood
Recent Comments
Leave a Comment

Related News