బన్నీతో మరోసారి స్టెప్పులేయనున్న పూజా హెగ్డే

admin
Published by Admin — May 14, 2026 in Movies
News Image
టాలీవుడ్లో అల్లు అర్జున్, పూజా హెగ్డేలది సూపర్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’ అనుకున్నంతగా ఆడలేదు కానీ.. అందులో వీరి కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా పాటలు, అందులో మంచి సింక్‌లో సాగిన ఇద్దరి డ్యాన్సుల గురించి ఎంత చెప్పినా తక్కువే. పూజా హెగ్డే కెరీర్లో ఈ చిత్రాన్ని పెద్ద మలుపుగా చెప్పొచ్చు. 
ఆ తర్వాత బన్నీతో కలిసి ఆమె ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో నటించగా అది రీజనల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
 
ఆ మూవీతో పూజా కెరీర్ పతాక స్థాయిని అందుకుంది. కానీ ఆ తర్వాత ఆమెకు కలిసి రాలేదు. వరుస ఫ్లాపులతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అంతర్థానం అయిపోయింది. మళ్లీ ఆమె తెలుగు సినిమాలో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి కానీ.. అవేవీ నిజం కాలేదు. 2022లో వచ్చిన ‘ఆచార్య’ తర్వాత తెలుగులో నటించనే లేదు పూజా. 
 
ఐతే ఎట్టకేలకు పూజాకు తెలుగులో ఓ పెద్ద అవకాశం వచ్చినట్లు సమాచారం. ఐతే అది జస్ట్ తెలుగు సినిమా కాదు. తెలుగు నుంచి రాబోతున్న భారీ పాన్ ఇండియా మూవీ. అందులో అల్లు అర్జున్ హీరో. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌తో బన్నీ ఒక సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అట్లీతో ‘రాకా’ పూర్తయ్యాక బన్నీ నటించే చిత్రమిదే.
 
సన్ పిక్చర్స్ లాంటి భారీ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. ఇందులో కథానాయిక పాత్రకు పూజాను ఓకే చేసినట్లు తెలుస్తోంది.  పూజా.. లోకేష్ చివరి చిత్రం ‘కూలీ’లో మోనికా పాటతో జనాలను ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు ఆమెకు ఫుల్ లెంగ్త్ రోల్ ఇస్తున్నాడట లోకేష్. మళ్లీ బన్నీ-పూజా జోడీని తెరపై చూడడం వీరి అభిమానులకు కనువిందే. తాను హీరోగా ఒక సినిమా పూర్తి చేసిన లోకేష్..
 
ప్రస్తుతం బన్నీ సినిమాకు పూర్తి స్థాయిలో స్క్రిప్టు రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఇది లోకేష్ కెరీర్లోనే బెస్ట్ స్క్రిప్ట్ అని అతడి రచనా భాగస్వామి, దర్శకుడు రత్నకుమార్ చెబుతున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి.
Tags
allu arjun pooja hegde paiging again movie
Recent Comments
Leave a Comment

Related News