వైసీపీకి ఎందుకు ఓటేయాలి ..?

admin
Published by Admin — April 20, 2026 in Politics, Andhra
News Image

వ్య‌తిరేక‌త‌ను  క‌వ‌ర్ చేసుకునేందుకు పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. పాజిటివిటీని ప్ర‌చారం చేసుకునేం దుకు అలుపెరుగ‌ని కృషి చేస్తాయి. ఈ రెండు విష‌యాల్లో పార్టీలు వ్య‌వ‌హ‌రించే తీరును బ‌ట్టే.. ప్ర‌జ‌ల్లో మ‌న్న‌న ఉంటుంది. అదే ఓటు బ్యాంకుగా కూడా మారుతుంది. త‌ద్వారా పార్టీల‌పై పాజిటివ్ ముద్ర ప‌డుతుంది. ఈ విష‌యంలో వైసీపీ వ్య‌తిరేక‌త నుంచి మ‌రింత వ్య‌తిరేక‌త దిశ‌గా వెళ్తోందే త‌ప్ప‌.. పాజిటివ్ కోణంలో అడుగులు వేయ‌డం లేద‌న్న‌ది నాయ‌కులు చెబుతున్న మాట‌.

ముఖ్యంగా 3 అంశాల్లో జ‌గ‌న్(jagan) వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును సొంత పార్టీ నాయ‌కులే త‌ప్పుబ‌డుతున్నారు. త‌ద్వా రా పార్టీకి.. నాయ‌కుల‌కు కూడా ఇబ్బందులు తెస్తున్నార‌ని అంటున్నారు. 1) వ్య‌తిరేక ముద్ర‌. 2) వ్య‌తిరేక ప్ర‌క‌ట‌న‌లు. 3) వ్య‌తిరేక చ‌ర్య‌లు. ఇలా.. అన్నీ వ్య‌తిరేక దిశ‌లోనే పార్టీ న‌డుస్తోంద‌ని సీనియ‌ర్లు బ‌లంగా చెబుతున్నారు.

1) వ్య‌తిరేక ముద్ర‌:  ప్ర‌త్య‌ర్థుల స‌హ‌జంగానే ఎదురు దాడి చేస్తారు. ఏ పార్టీ అయినా.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఎద‌గాల‌ని కోరుకోదు. ఈ క్ర‌మంలో బ‌ల‌మైన ముద్ర ప‌డేలా.. మాస్‌లో వ్య‌తిరేక‌త వ‌చ్చేలా ప్ర‌య‌త్నిస్తాయి. ఈ వ్య‌తిరేక‌త‌ను త‌ట్టుకుని.. బ‌లంగా ముందుకు సాగ‌డం ఆయా పార్టీల‌కు ఉండాల్సిన ప్ర‌ధాన క‌ర్త‌వ్యం. కానీ.. ఈ విష‌యంలో జ‌గ‌న్ మౌనంగా ఉంటున్నారు. గ‌తంలో చంద్ర‌బాబును వృద్ధుడు అంటూ.. వైసీపీ ప్ర‌చారం చేసింది. ఆయ‌న వ‌య‌సును కూడా ప్ర‌స్తావించింది. దీంతో చంద్ర‌బాబు మ‌రింత యాక్టివ్‌గా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చి.. ఆ వ్య‌తిరేక ముద్ర ప‌డ‌కుండా చూసుకున్నారు.

2) వ్య‌తిరేక ప్ర‌క‌ట‌న‌లు:  రాష్ట్రంలో తాము మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే.. మంచి చేస్తామ‌ని ఏ పార్టీ అయినా చెబుతుంది. గ‌తంలో టీడీపీ(tdp) ఇలానే చేసింది. ఇసుక‌ను వైసీపీ వ్యాపారం చేసింద‌ని.. తామొస్తే.. ఉచితంగా ఇస్తామ‌ని చెప్పింది. మ‌ద్యాన్నినాసిర‌కం చేసింద‌ని.. తామొస్తే.. నాణ్య‌మైన మ‌ద్యాన్ని త‌క్కువ ధ‌ర‌ల‌కు ఇస్తామ‌ని చంద్ర‌బాబు(chandrababu) చెప్పారు. ఇలా.. అనేకం ఉన్నాయి. కానీ, ఇప్పుడు వైసీపీ(ycp).. తాము అధికారంలోకి వ‌స్తే.. పెట్టుబ‌డుల‌ను వెళ్ల‌గొడ‌తామ‌ని.. రాజ‌ధాని అమ‌రావ‌తిగా ఉండ‌ద‌ని చెప్ప‌డం ద్వారా ఏం సాధిస్తుందో చూడాల‌ని సీనియ‌ర్లు అంటున్నారు.

3) వ్య‌తిరేక చ‌ర్య‌లు:  అధికారంలో ఉన్న పార్టీపై బెదిరింపు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌డాన్ని వైసీపీ సీనియ‌ర్లు త‌ప్పుబ‌డుతున్నారు. ప్ర‌జ‌ల‌ను మంచి చేసుకుంటే.. అది క‌ల‌కాలం నిల‌బ‌డుతుంద‌ని.. కానీ.. ప్ర‌భుత్వంపై తిరుగుబాటు చేస్తే.. అది మంచి సంప్ర‌దాయం కాద‌ని అంటున్నారు. కానీ, జ‌గ‌న్ మాత్రం అధికారుల‌ను.. మంత్రుల‌ను కూడా హెచ్చ‌రిస్తున్నారు. ఇది వ్య‌తిరేక‌తను మ‌రింత పెంచుతోంద‌ని చెబుతున్నారు. దీంతో వైసీపీ ఎందుకు ఓటేయాలి(vote for ycp)..? అని ఎవ‌రైనా అడిగితే.. నాయ‌కులు స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితిని తామే క‌ల్పించుకుంటున్నారు.

Tags
vote for ycp tdp AP CM Chandrababu Ex cm ys Jagan threatening
Recent Comments
Leave a Comment

Related News