లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన 200 కుటుంబాలు!

admin
Published by Admin — October 26, 2026 in Andhra
News Image

మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామానికి చెందిన సీపీఎం మండల కమిటీ మాజీ సభ్యుడు, కాట్రగడ్డ శివన్నారాయణతో పాటు ఆ పార్టీకి చెందిన 100 కుటుంబాలు, మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన సీపీఎం మండల మాజీ కార్యదర్శి, మాజీ ఉప సర్పంచ్ ముసలి జ్యోతిబసుతో పాటు 40 కుటుంబాలు మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరాయి. దుగ్గిరాల మండలం పేరుకలపూడికి చెందిన వైసీపీ సీనియర్ నేత నూతలపాటి చెన్నకేశవరావుతో పాటు 10 కుటుంబాలు, దుగ్గిరాల మండలం ఈమని గ్రామానికి చెందిన వైసీపీ నేత ఉయ్యూరు వెంకటేశ్వరరావుతో పాటు వైసీపీకి చెందిన 15 కుటుంబాలు, ఈమనికి చెందిన వైసీపీ నేత ముద్రబోయిన శ్రీనుతో పాటు 15 కుటుంబాలు, దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన వైసీపీ నేత షేక్ యూసబ్ తో పాటు 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఉండవల్లి నివాసంలో వీరందరికీ టీడీపీ కండువాలు కప్పి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

అత్యధిక మెజార్టీతో గెలిపించారు

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో 21 రోజుల ముందు మంగళగిరికి వచ్చాను. నేనేంటో మీకు అర్థం కాలేదు. మీ సమస్యలేంటో నాకు తెలియవు. ఫలితంగా 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయాను. అప్పటి నుంచి ఐదేళ్ల పాటు ప్రజల్లో ఉండి వారి సమస్యలు అర్థం చేసుకున్నా. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం 26 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ పరంగా చేపట్టాం. అంతకుముందు 15 ఏళ్లు మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన వారు చేసిన అభివృద్ధిని, నేను చేపట్టిన కార్యక్రమాలను బేరీజు వేసుకుని 53వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశా. ఎంత ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తే అంత బలం వస్తుందని ఆనాడు చెప్పా. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే మూడో అత్యధిక 91వేల మెజార్టీతో గెలిపించారు. 

7వేల ఇంటి పట్టాలు అందించిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానిది

అత్యధిక మెజార్టీతో గెలిపించారు కనుకనే మంగళగిరి నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. కమ్యూనిటీ, అంగన్ వాడీ భవనాలు, పార్కులు, చెరువులు, శ్మశానాలు, చర్చిలు, దేవాలయాలు అభివృద్ధి చేశాం. దేశం మొత్తం మంగళగిరి వైపు చూసేలా నిడమర్రు ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేశాం. క్రమపద్ధతిలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. కక్షలు ముఖ్యం కాదు.. అభివృద్ధి ముఖ్యం అనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మొదటి దశ కింద రూ. 1,300 కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టాం. 2029 నాటికి ప్రతి గడపకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తాం. అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్, గ్యాస్, కరెంట్ అందిస్తాం. దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి శాశ్వత ఇంటి పట్టాలు అందజేశాం. నూతన వస్త్రాలు, భోజనం పెట్టి ఇప్పటివరకు 7వేల ఇంటి పట్టాలు అందించిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానిది. 

మీ ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి

మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా ముందుకు తీసుకువెళ్తున్నాం. మీ ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుతున్నా. మంగళగిరిలో భారీ మెజార్టీతో గెలిపించడం వల్ల అడిగిన పనులు కాదనకుండా మంజూరు చేస్తున్నారు. దేశం మొత్తం మంగళగిరి వైపు చూసేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేది నా లక్ష్యం. నా మొదటి ప్రాధాన్యత మంగళగిరి. ఈ రోజు ఉప రాష్ట్రపతి వస్తే మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించాం. వారి సతీమణికి మంగళగిరి చేనేత చీరను బహూకరించాం. ఇక్కడ పుట్టకపోయినా మంగళగిరిని నా సొంతం చేసుకున్నా. మంగళగిరిని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా.  

నేతలు ప్రజల మనస్సు గెలుచుకోవాలి

మంగళగిరి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. నియోజకవర్గ అభివృద్ధికి ఐదేళ్లు అహర్నిశలు కష్టపడతా. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచేలా చూడాల్సిన బాధ్యత స్థానిక నాయకత్వానిదే. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి. ప్రజల మనస్సు గెలుచుకోవాల్సిన బాధ్యత ఇక్కడి నాయకులపై ఉంది. అహంకారం వీడాలి. అందరినీ కలుపుకొని పోవాలి. నియోజకవర్గ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, తాడేపల్లి రూరల్ టీడీపీ అధ్యక్షుడు దాసరి కృష్ణ, మంగళగిరి మండల పార్టీ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
Tags
200 families joined TDP minister lokesh Mangalagiri
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News