హైకోర్టుకు బన్నీ..రీజనిదే

admin
Published by Admin — April 17, 2026 in Movies
News Image

తమ అనుమతి లేకుండా తమ ఫొటోలు, వీడియోలు వాడుకుంటున్నారని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. అదే కోవలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun) కూడా పయనిస్తున్నాడు. తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం బన్నీ ఢిల్లీ హైకోర్టు(Delhi highcourt) తలుపు తట్టాడు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, చివరకు తన వాయిస్‌ను ఎవరూ కమర్షియల్ గా వాడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ముప్పు ఉన్న ఈ కాలంలో సెలబ్రిటీల వాయిస్, ఫొటోలను మార్ఫింగ్ చేసి యాడ్స్ కు వాడుకుంటున్న తీరుపై అల్లు అర్జున్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ వేసిన పిటిషన్ ను జస్టిస్ తుషార్ రావు గెడెల ధర్మాసనం విచారణకు స్వీకరించింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అమితాబ్ తరహాలోనో కోర్టును ఆశ్రయించగా...వారికి అనుకూలంగా కోర్టు ఆదేశాలిచ్చింది. బన్నీ విషయంలో కూడా అదే జరిగే అవకాశముంది.

Tags
tollywood actor allu arjun Delhi High Court photos misuse
Recent Comments
Leave a Comment

Related News