ఆ సినిమా ఫ్లాప్ అని ఒప్పుకున్న స్టార్ డైరెక్టర్

admin
Published by Admin — April 12, 2026 in Movies
News Image
ఒక సినిమా విడుద‌ల కాక‌ముందే అదొక అద్భుతం అంటారు మేక‌ర్స్. రిలీజ్ అయ్యాక టాక్, వ‌సూళ్లు బాలేకున్నా స‌రే.. అది ఫెయిల్యూర్ అని అంత సులువుగా ఒప్పుకోరు. సినిమా థియేట‌ర్ల‌లో ఉండ‌గా దాన్ని ప్ర‌మోట్ చేస్తూ వాళ్ల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించాలి కాబ‌ట్టి సినిమా హిట్టు, బ్లాక్ బ‌స్ట‌ర్ అనే చెప్పుకోవాలి. కానీ ఆ చిత్రం థియేట్రిక‌ల్ ర‌న్ ముగిశాక మాత్రం వాస్త‌వంలోకి వ‌స్తారు. సినిమా అనుకున్నంత‌గా ఆడ‌లేద‌నే విష‌యాన్ని అంగీక‌రిస్తారు.
 
ఇంకా కొన్ని రోజులు పోయాక సినిమా అస‌లు ఫ‌లితం గురించి క్రిస్ట‌ల్ క్లియ‌ర్‌గా మాట్లాడతారు. టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ సైతం ఇదే ప‌ని చేశాడిప్పుడు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో గ‌బ్బ‌ర్ సింగ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ రూపొందించిన ఉస్తాద్ భ‌గత్ సింగ్ గ‌త నెల‌లో విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. కంటెంట్ ప‌రంగా యావ‌రేజ్ సినిమానే అయిన‌ప్ప‌టికీ.. దీనిపై పెట్టిన పెట్టుబ‌డి, వ‌చ్చిన రాబ‌డిని పోల్చి చూస్తే సినిమా డిజాస్ట‌ర్ అనే చెప్పాలి.
 
ఐతే హ‌రీష్ శంక‌ర్(harish shankar) ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌(ustaad bhagat singh)ను గొప్ప సినిమాగా చెప్పుకుంటూ వ‌చ్చాడు. గ‌బ్బ‌ర్ సింగ్ కంటే ఇదే తన‌కు స్పెష‌ల్ అని.. ఈ సినిమా తీసినందుకు గ‌ర్విస్తున్నాన‌ని చెప్పాడు. సినిమాను మిగ‌తా టీం అంతా వ‌దిలేసినా.. చాలా రోజుల పాటు దాన్ని ప్ర‌మోట్ చేశాడు హ‌రీష్‌. ఐతే ఈ సినిమా థియేట్రిక‌ల్ ర‌న్ ముగిశాక.. తాజాగా పాపం ప్ర‌తాప్ అనే కొత్త సినిమా ఈవెంట్‌కు అతిథిగా వ‌చ్చిన హ‌రీష్‌.. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ఫ్లాప్ అనే విష‌యాన్ని ప‌రోక్షంగా అంగీక‌రించాడు. 
 
ఈ సినిమా టైటిల్‌ను ప్ర‌మోట్ చేసే క్ర‌మంలో యాంక‌ర్ ప్ర‌శాంత్ అతిథుల గురించి ప్ర‌స్తావించేట‌పుడు పేరు ముందు పాపం అని జోడించింది. హ‌రీష్‌ను కూడా పాపం హ‌రీష్ అని సంబోధించింది. త‌ర్వాత హ‌రీష్ ప్ర‌సంగించేట‌పుడు.. ఈ విష‌యం ప్ర‌స్తావించాడు.త‌న‌ను ప్ర‌శాంతి పాపం హ‌రీష్ అన‌గానే.. ఈ మ‌ధ్య రిలీజైన‌ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ అనుకున్నంత‌గా ఆడ‌లేదు కాబ‌ట్టి, త‌న ప‌ట్ల జాలి చూపిస్తూ అలా పిలిచిందేమో అనుకున్నాన‌ని హ‌రీష్ న‌వ్వుతూ వ్యాఖ్యానించాడు.
 
కానీ అది టైటిల్ ప్ర‌మోష‌న్లో భాగంగా అన్న మాట అని త‌ర్వాత అర్థ‌మైంద‌ని అత‌ను చెప్పాడు. హ‌రీష్ ఈ మాట అన‌గానే యాంక‌ర్ ప్ర‌శాంతి వ‌చ్చి అలాంటిదేమీ లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చుకుంది. ఈ సంగ‌తెలా ఉన్న‌ప్ప‌టికీ.. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ఫ్లాప్ అన్న విష‌యాన్ని హ‌రీష్ త్వ‌ర‌గానే ఒప్పేసుకున్నాడ‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.
Tags
ustad bhagat singh telugu movie Director Harish Shankar flop admits
Recent Comments
Leave a Comment

Related News