లోకేశ్ ఉగాది గిఫ్ట్.. వచ్చేసింది జాబ్ క్యాలెండర్!

admin
Published by Admin — March 19, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత నిరీక్షణకు తెరపడింది. శ్రీ పరాభవ నామ ఉగాది వేళ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేవలం శుభాకాంక్షలతోనే సరిపెట్టకుండా, నిరుద్యోగుల ఇళ్లలో నిజమైన వెలుగులు నింపేలా 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఉద్యోగాల పండుగను స్వయంగా ప్రకటించారు.

ఈసారి కేవలం నోటిఫికేషన్లతో ఆగిపోకుండా, ఒక పక్కా ప్రణాళికతో జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? పరీక్షలు ఏ తేదీన జరుగుతాయి? వంటి వివరాలన్నీ ముందే వెల్లడించడంతో అభ్యర్థులకు స్పష్టత లభించింది. పరీక్షల నిర్వహణలో జాప్యం లేకుండా, నిర్దేశిత సమయంలోనే నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని, సిలబస్‌ను కూడా ముందుగానే అందుబాటులో ఉంచుతామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.

ఉద్యోగార్థుల సౌలభ్యం కోసం సరికొత్త నైపుణ్యం పోర్టల్ ను కూడా ప్రభుత్వం యాక్టివేట్ చేసింది. ఇందులో ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు, ప్రతి ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన అలర్ట్స్ నేరుగా మొబైల్‌కే అందుతాయి. ఇకపై ఏటా ఉగాది అంటే కొలువుల పండుగే అని ప్రకటించడం ద్వారా నిరుద్యోగుల్లో సరికొత్త భరోసా నింపారు. ఏపీని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంలో యువతను భాగస్వామ్యం చేసేలా ఈ కీలక అడుగు పడింది.

 

Tags
AP Job Calendar 2026 Andhra Pradesh Jobs Nara Lokesh Ugadi 2026 AP Govt Jobs Job Notification TDP
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News