ఆప‌ద వేళ‌.. అప‌న్న‌హ‌స్తం.. బాబు ఉదారం!

admin
Published by Admin — October 28, 2026 in Politics
News Image

ఏపీలో సంభ‌వించిన ఆర్న‌బ్ తుఫాను ఉత్త‌రాంధ్ర స‌హా ప‌లు జిల్లాల‌ను అతలాకుత‌లం చేసింది. ఈ నేప‌థ్యంలో ఆయా జిల్లాల్లో వేలాది మంది నిరాశ్ర‌యులు అయ్యారు. వారిని ఆదుకునేందుకు కేంద్రం నుంచి సీఎం చంద్ర‌బాబు సాయం ఆశించారు. ఈ క్ర‌మంలో తుఫాన్ నష్టంపై కేంద్రానికి ఆయ‌న‌ లేఖ రాయటంతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. చంద్ర‌బాబుకు స్వ‌యంగా ఫోన్ చేసి మాట్లాడాను. ఈ నేప‌థ్యంలో అమిత్ షాకు తుఫాను తీవ్రత, రాష్ట్రంపై దాని ప్రభావం అంశాలను వివరించారు.

ప్రాథమికంగా నష్ట తీవ్రత అంచనాను కేంద్రానికి పంపించ‌నున్నారు. అలాగే.. కొబ్బరి, ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని.. వాటి వివ‌రాల‌ను కూడా పంపించ‌నున్నామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. పూర్తిస్థాయి సమగ్ర నివేదికను కూడా త్వరలోనే పంపేలా చర్యలు చేపడతామ‌ని పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో ప్రాధ‌మికంగా సీఎం చంద్ర‌బాబు బాధితుల‌ను ఆదుకునేందుకు భారీ ప‌రిహారం ప్ర‌క‌టించారు. ప్ర‌ధానంగా ఆర్థిక సాయంతోపాటు నిత్యావ‌స‌రాల స‌రుకుల‌ను కూడా అందించ‌నున్నారు. అలానే రైతుల‌ను, వాహ‌న దారుల‌ను కూడా ఆదుకునేందుకు ప్యాకేజీ ప్ర‌క‌టించారు.

ఇదీ.. సాయం!

+ ముంపు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరితే 25 కేజీల బియ్యం.

+ చేనేత మగ్గాలు, మత్స్యకారులకు 50 కేజీల బియ్యం, కేజీ చొప్పున ఉల్లిపాయలు, వంటనూనె, కందిపప్పు రేషన్.

+ షెల్టర్ క్యాంపుల్లో తలదాచుకున్న వారికి రూ.1000 చొప్పున ఆర్ధిక సాయం.

+ మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం.

+ తుపాను కార‌ణంగా ఇల్లు పాక్షికంగా ధ్వంసమైతే రూ.10 వేలు, దుకాణాలకు రూ.25 వేలు సాయం.

+ ఎంఎస్ఎంఈలకు కేటగిరీల వారీగా ఆర్ధిక సాయం, ద్విచక్ర వాహనం పాడైతే రూ.3 వేల సాయం.

+ ఆటోలకు 10 వేలు, పుష్ కార్ట్‌లకు 20 వేలు, వీవర్ కమ్యూనిటీకి రూ.25 వేలు, ఫిషింగ్ బోట్, వలలు ధ్వంసమైతే రూ.25 వేలు సాయం.

రైతుల‌కు కూడా..

+ తుఫాను కార‌ణంగా దెబ్బ‌తిన్న పంట‌ల‌కు.. హెక్టారుకు పత్తికి రూ.25 వేలు, చెరకుకు రూ.25 వేల చొప్పున, ఇతర పంటలకు ఆయా కేటగిరీల వారీగా ఆర్ధిక సాయం.

+ అరటి పంటకు హెక్టారుకు రూ.35 వేల చొప్పున ఆర్ధిక సాయం.

+ టమోటాకు రూ.25 వేలు చొప్పున సాయం.

+ వ్యవసాయ, ఉద్యాన పంటల ఎన్యుమరేషన్ చేసి రైతాంగాన్ని ఆదుకుంటాం.

+ తుఫాను ప్రభావిత జిల్లాల్లో పంటలు మినహా మిగతా చోట్ల బాధితులకు ఆర్ధిక సాయం.

Tags
Arnab cyclone cm chandrababu ex gratia
Recent Comments
Leave a Comment

Related News