ఓటు ఎలా వేసిన ఓటమి వైసీపీదే: పవన్

admin
Published by Admin — November 04, 2026 in Andhra
News Image

ఏపీలో జ‌రిగిన స్థానిక సంస్థ‌లు, మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో కూట‌మి పార్టీల అభ్య‌ర్థులు ఘ‌న విజ‌యం సాధించారు. 13 కార్పొరేష న్లు, 87 మునిసిపాలిటీల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. అర్ధ‌రాత్రి వ‌ర‌కు కొన్ని ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగింది. అయితే.. ఈ విజ‌యాన్ని ఆశ్వాదిస్తూ.. జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ రాత్రి వేళ‌లో స్పందించారు. ఈవీఎంలైనా.. బ్యాలెట్ అయినా.. ఎన్నిక‌ల పోలింగ్ ఏ రీతిలో జ‌రిగినా కూట‌మి వైపే ప్ర‌జ‌లు ఉన్నార‌న్న‌ది నిరూపిత‌మైంద‌న్నారు. ప్ర‌జ‌లు పూర్తిగా కూట‌మిని ఆశీర్వ‌దించార‌ని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ పేరును ప్ర‌స్తావించ‌కుండానే విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈవీఎంల‌పై జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓడి పోయిన `ఓ పార్టీ` ఏకంగా ఈవీఎంల‌నే నిందించిందని, కానీ ఇప్పుడు బ్యాలెట్‌పై జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ప్ర‌జ‌లు కూటమినే ఆద‌రించార‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. ఎన్నిక‌లు ఏ రూపంలో జ‌రిగినా కూట‌మి వైపే ప్ర‌జ‌లు ఉన్నార‌న్నది మ‌రోసారి నిరూపించార‌ని పేర్కొన్నారు. న‌గ‌ర పాల‌క సంస్థ‌లు, కార్పొరేష‌న్ల‌లో కూట‌మి అభ్య‌ర్థులు అఘండ విజ‌యాలు సాధించార‌ని, ఇది ప్ర‌జ‌లు ఇచ్చిన అపూర్వ‌మైన తీర్పు అని తెలిపారు. ఇది కూట‌మి ప్ర‌భుత్వం అందిస్తున్న పాల‌న ప‌ట్ల ప్ర‌జ‌ల‌కు ఉన్న విశ్వాసాన్ని స్ప‌ష్టం చేస్తోంద‌న్నారు.

మ‌రింత సేవ‌..

ఈ తీర్పు కూట‌మి ప్ర‌భుత్వంపై మ‌రింత బాధ్య‌త‌ను పెంచింద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. ప్ర‌జ‌ల‌కు మ‌రింత సేవ చేసే అవ‌కాశం ల‌భించింద న్నారు. ఇప్ప‌టికే గ్రామీణ ప్రాంతాల్లో చేప‌ట్టిన అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు వంటివి ప్ర‌జ‌ల‌ను సంతృప్తి ప‌రుస్తున్నాయ‌న్నారు. ముఖ్యంగా ర‌హ‌దారుల నిర్మాణం, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న విష‌యంలో కూట‌మి చూపుతున్న చొర‌వ‌కు ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు త‌మ ఓటు ద్వారా హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేశార‌ని అన్నారు. కూట‌మి పార్టీల‌కు ప్ర‌జ‌లు అందించిన విజ‌యం ప‌ట్ల అభినంద‌న‌లు తెలుపుతున్నా మ‌న్నారు. మ‌రింత‌గా సేవ చేసే అవ‌కాశం ఇచ్చార‌ని పేర్కొన్నారు.

జ‌న‌సేన అభ్య‌ర్థుల‌కు..

జ‌న‌సేన త‌ర‌ఫున విజ‌యం దక్కించుకున్న అభ్య‌ర్థుల‌ను ఉద్దేశించి ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కూట‌మిగా ఉండ‌బ‌ట్టే ఈ విజ‌యం సాధించామ‌న్న విష‌యాన్ని గుర్తించాల‌న్నారు. క‌ల‌సి క‌ట్టుగా ఉంటేనే ఈ విజ‌యం ప్ర‌జ‌లు అందించార‌ని తెలిపారు. జ‌న‌సేన గెలుపుతో పార్టీకి మ‌రింత శ‌క్తి వ‌చ్చింద‌న్నారు. దీనిని ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు వినియోగించుకోవాల‌ని సూచించారు. ``ఛైర్మన్, మేయర్ అభ్యర్ధులకు దక్కిన విజయాలు, ఆధిక్యతలు చూస్తే.. ప్రజలు జనసేనకి ఇస్తున్న ఆదరణ ఎంతో విలువైనది. వారు పార్టీ పట్ల కనబరిచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం.`` అని సేనాని వ్యాఖ్యానించారు. 

Tags
Pawan kalyan's comments on evm machine
Recent Comments
Leave a Comment

Related News