వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ వ్యవహారంలో భారీ ఎత్తున నగదు చేతులు మారిందని.. కొంత మొత్తం మనీలాండరింగ్ ద్వారా విదేశాలకు కూడా తరలిపోయిందని భావిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ అధి కారులు తాజాగా నాడు ఏపీపీఎస్సీకి కార్యదర్శిగా పనిచేసిన అప్పటి ఐపీఎస్, ప్రస్తుత మాజీ అధికారి పీఎస్ ఆర్ ఆంజనేయులు నివాసంలో విస్తృతంగా సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంతోపాటు బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు.
అలానే.. ఆనాడు.. గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాలను మూల్యాంకనం చేసిన డిజిటల్ సంస్థ క్యామ్‌సైన్ కార్యాల యంలోనూ దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లో ఆరు చోట్ల, గుంటూరు జిల్లాలో ఒకచోట తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా సికింద్రాబాద్‌లోని డిఫెన్స్ కాలనీలో ఉన్న ట్రూగ్రేడర్ సర్వీస్ కార్యాలయంలోనూ సోదాలు చేశారు. అలానే.. హ్యాలాండ్‌లోనూ ఈడీ అధికారులు తనిఖీ చేశారు. పలు కంప్యూటర్ హార్డ్ డిస్కులను, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలానే.. బ్యాంకు ఖాతాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
అప్పట్లో ఏం జరిగింది?
టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అనంతరం సర్కారు మారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో జరిగిన ప్రధాన పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాలను వేర్వేరు ప్రాంతా ల్లో దిద్దించారు. ఇది.. అనేక వివాదాలకు దారితీసింది. ఈ జవాబు పత్రాలను.. సెంట్రింగ్ మేస్త్రీలతోనూ.. కార్మికుల తోనూ.. క్యాజువల్ ఉద్యోగులతోనూ దిద్దించారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణకు దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు.. ఇప్పటికే దీనిపై కోర్టులో నివేదిక సమర్పించారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
ఈడీ ఎంట్రీ..
ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు సైతం రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే మాన్యువల్ మూల్యాకనం.. జరిగిన హాయ్‌లాండ్, డిజిటల్ మూల్యాంకనం జరిగిన క్యామ్‌సన్ కార్యాల యాల్లోనూ తనిఖీలు చేశారు. ఈ క్రమంలో భారీ ఎత్తున సొమ్ములు చేతులు మారినట్టుగా అధికారులు చెబుతున్నా రు. ఆ సమయంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న పీఎస్ ఆర్ ఆంజనేయులు నేతృత్వంలోనే ఈ తతంగం జరిగిందని భావిస్తున్నారు. అందుకే ఆయన ఇంట్లోనూ సోదాలు చేపట్టారు.