స్థానిక సంస్థల ఎన్నిక ల సందర్భంగా చెలరేగిన హింస పూర్తిగా వైసీపీ నేతృత్వంలోనే జరిగిందని.. కర్త, కర్మ, క్రియ అన్నీ ఆ పార్టీయేనని సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ``ఇటీవల జరిగిన హింస, దౌర్జన్యాలకు గొడ్డలి పార్టీనే ప్రధాన కారణం. ప్రజల్లో ఆ పార్టీపై పూర్తిగా వ్యతిరేకత ప్రబలి పోయింది. దీనిని తగ్గించుకునేందుకు హింసచెలరేగేలా చేసి సానుభూతి పొందాలని ప్రయత్నించింది.`` అని చంద్రబాబు అన్నారు.
షర్మిల కూతురు పెళ్లి తన ఇంట్లో జరగడానికి వీల్లేదు అని జగన్ అంటున్నారని, మేనమామగా జగన్ ఫెయిల్ అయ్యారని ఆయన చెప్పారు.అదే మాదిరిగా ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా కూడా జగన్ విఫలం చెందారని చంద్రబాబు అన్నారు.
రౌడీలు, గూండాలను ప్రజలు హర్షించరని చంద్రబాబు చెప్పారు. అందుకే గత ఎన్నికల్లో కూటమికి 94 శాతం స్ట్రయి క్ రేట్ సాధించిందని తెలిపారు. గొడ్డలి పార్టీ హింసాత్మక ప్రవృత్తిని వీడడం లేదన్నారు. తాము గొడవలు సృష్టించి.. కత్తులు, కర్రలతో వీరంగం వేసి.. హత్యా రాజకీయాలు చేస్తోందని చెప్పారు. అందుకే.. ప్రజలు ఆ పార్టీని ఛీ కొడుతు న్నారని అన్నారు. గొడ్డలి పార్టీ ఇప్పుడే కోలుకునే పరిస్థితి లేదన్నారు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని తాము ఎంతో కష్టపడ్డామని.. కడాన 34 శాతం రిజర్వేషన్ కల్పించామనిదానిని కూడా గొడ్డలి పార్టీ అడ్డుకుందని చెప్పారు.
కూటమి పార్టీల అభ్యర్థులపైనే వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. దర్శిలో పోలీసు లు కూడా గాయపడ్డారని.. ఇలాంటి వారు రాజకీయాలకు అవసరమా? అని ప్రశ్నించారు. ప్రజలు ఆలోచన చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కుటుంబ రాజకీయాల గురించి తాను మాట్లాడబోనని అన్నారు. పరోక్షంగా జగన్-షర్మిల కుటుంబంలో తలెత్తిన వివాదాన్ని ఆయన ప్రస్తావించారు. వారి ఫ్యామిలీ విషయాలపై ప్రజలే ఆలోచన చేస్తారని అన్నారు.
2019-24 మధ్య తానే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా కంటిపై నిద్రలేని రాత్రులు గడిపారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం ఏమైనా ఫర్వాలేదు.. తమ వ్యాపారాలు, అజెండా అమలు కావాలన్నదే.. వైసీపీ నేతల పంతమని అలానే వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో ఎన్ని చట్టాలు అమలు చేసినా.. ప్రజలు ఇచ్చే తీర్పే వారికి చెంప పెట్టుకావాలని సూచించారు. ప్రజలు అన్ని కోణాల్లోనూ ఆలోచించి నేతలను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. గొడ్డలి పార్టీకి సమాధి కట్టాలని ఆయన వ్యాఖ్యానించారు.