అక్కడ కూడా వైసిపి నేతల పంచాయితీ!

admin
Published by Admin — October 19, 2026 in Andhra
News Image

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి స‌హా.. ప‌లువురిపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. దీంతో వారు ప‌రుగులు పెట్టారు. అనంత‌రం.. రాచ‌మ‌ల్లు ఆధ్వ‌ర్యంలో రోడ్డుపై నిర‌స‌న వ్య‌క్తం చేశారు. క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో సోమ‌వారం ఉద‌యం తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. నామినేష‌న్ల ప‌ర్వం ముగిసి.. వాటిని ప‌రిశీలించే ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. సోమ‌వారం సాయంత్రానికి నామినేష‌న్ల ప‌రిశీల‌న ప్ర‌క్రియ ముగియ నుంది. అయితే.. త‌మ‌వారిని అడ్డుకున్నార‌ని ఆరోపిస్తూ.. ప‌లువురు వైసీపీ నాయ‌కులు రాష్ట్రంలో ఆందోళ‌నకు దిగారు.

ఈ క్ర‌మంలో నంద్యాల‌,క‌డ‌ప‌జిల్లా ప్రొద్దుటూరు, మార్కాపురం జిల్లా క‌నిగిరి, చిత్తూరు జిల్లా కుప్పంల‌లోని నామినే ష‌న్ ప‌రిశీలన కేంద్రాల‌కు ప‌దుల సంఖ్య‌లో చేరుకున్న వైసీపీ నేత‌లు.. ఆందోళ‌న‌కు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. చెద‌ర‌గొట్టారు. ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున నాయ‌కులు నామినేష‌న్ ప‌రిశీల‌న కేంద్రానికి చేరుకున్నారు. ఈ క్ర‌మంలో ముందుగానే పోలీసులు బారికేడ్ల‌ను అడ్డు పెట్టి అడ్డుకున్నారు. కానీ, రాచ‌మ‌ల్లు దురుసుగా ముందుకు దూసుకువ‌చ్చి బ్యారికేడ్ల‌నుతోసేసే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో పోలీసులు లాఠీల‌కు ప‌నిచెప్పారు.

అనంతరం రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స‌హా వైసీపీ నేతలు రోడ్ల‌పైనే బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక‌, క‌నిగిరిలోనూ నామినేష‌న్ల ప‌ర్వం ఉద్రిక్త‌త‌లకు దారితీసింది. టీడీపీ, వైసీపీ నేత‌ల మ‌ధ్య వివాదాలు చెల‌రేగాయి. ఆర్వో కేంద్రంలోకి దూసుకువెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌గా పోలీసులు అడ్డుకున్నా రు. ఇక‌, వైసీపీ-టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల మ‌ధ్య వివాదం చెల‌రేగి ఒక‌రినొక‌రు తోసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వర్గం కుప్పంలోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. వైసీపీ నాయ‌కులు కొందరు నామినేష‌న్ల ప‌రిశీల‌న కేంద్రం వ‌ద్ద‌కు ఆందోళ‌న చేయ‌గా.. పోలీసులు చెద‌ర‌గొట్టారు.

ఎందుకిలా..

నామినేష‌న్ల దాఖ‌లు స‌మ‌యంలో వివాదాలు చోటు చేసుకున్నాయంటే అర్ధం ఉంది. కానీ, నామినేష‌న్ల ప‌రిశీల‌నలో కూడా వైసీపీ ర‌గ‌డ సృష్టించేందుకు ప్ర‌య‌త్నాలు చేసింద‌న్న వాద‌న వినిపిస్తోంది. దీనికి కార‌ణం.. త‌మ వారు దాఖ‌లు చేసిన నామినేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తార‌న్న బెంగ పార్టీలో స్ప‌ష్టంగా క‌నిపించింది. అయితే.. అధికారులు మాత్రం నిబంధ‌న‌ల మేర‌కే తాము వ్య‌వ‌హ‌రిస్తామ‌ని.. ఎవ‌రి ప‌ట్ల ప‌క్ష‌పాతం చూపించ‌బోమ‌ని చెప్పారు. కానీ.. వైసీపీ నాయ‌కులు మాత్రం ఆందోళ‌న ఆప‌డం లేదు. 

Tags
Ycp creating rukus at nomination centres
Recent Comments
Leave a Comment

Related News