బాబును పొగిడిన కేటీఆర్.. జగన్ కక్కలేక మింగలేక..!

admin
Published by Admin — October 30, 2026 in Politics, Andhra, Telangana
News Image

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి మరోసారి నిజమవుతోంది. నిన్నటి వరకు ఒకరినొకరు తీవ్రంగా వ్యతిరేుకించుకున్న నేతలు, ఇప్పుడు పరిస్థితుల ప్రభావంతో కొత్త సమీకరణాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) పేరు చెబితేనే మండిపడిన గులాబీ శిబిరం, ఇప్పుడు ఆయన పాలనా దక్షతను ప్రశంసిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది.

తెలంగాణ భవన్‌లో ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేశాయి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కరువును సమర్థవంతంగా ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమైందని మండిపడిన కేటీఆర్.. సరిగ్గా అదే సమయంలో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను కొనియాడారు. ఏపీలోనూ కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ, బాబు ముందుచూపు వల్ల ఆ ప్రభావం పెద్దగా కనిపించడం లేదంటూ ఆకాశానికెత్తేశారు. రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు కేటీఆర్ ఏకంగా చంద్రబాబు పాలనను ఉదాహరణగా చూపడం గమనార్హం.

ఇక్కడే అసలు సిసలు రాజకీయ నాటకం తెరపైకి వచ్చింది. ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ(YCP) ఎకోసిస్టమ్ తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చంద్రబాబును ఎవరైనా కాస్త అభినందిస్తే చాలు, సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడే ఆ పార్టీ సైన్యం, కేటీఆర్ చేసిన వ్యాఖ్యల విషయంలో మాత్రం అంతులేని మౌనం పాటిస్తోంది. జగన్, కేటీఆర్ మధ్య ఉన్న వ్యక్తిగత మైత్రీ బంధం అందరికీ తెలిసిందే. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు రాజకీయ అవసరాలు వేరుగా ఉండటంతో, రేవంత్ రెడ్డిని దెబ్బకొట్టేందుకు చంద్రబాబును పావుగా వాడుకున్నారు కేటీఆర్.

మరి ఇక్కడ జగన్ పరిస్థితి ఏంటంటే రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తే తెలంగాణలో బీఆర్‌ఎస్‌(BRS)తో ఉన్న బంధం దెబ్బతింటుంది, అలాగని మౌనంగా ఉంటే శత్రువైన చంద్రబాబు సమర్థతను అంగీకరించినట్లవుతుంది. దీంతో ఏం చేయలేక, నోరు మెదపలేక వైసీపీ అధినాయకత్వం మింగలేక కక్కలేక తీవ్ర సందిగ్ధంలో పడిపోయింది. మొత్తానికి, కేటీఆర్ వేసిన ఈ కొత్త పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్.. రెండు రాష్ట్రాల రాజకీయాల్లో ఇటు బీఆర్‌ఎస్, అటు వైసీపీల మధ్య సరికొత్త చర్చకు తెరలేపింది.

Tags
KTR CM Chandrababu Naidu Revanth Reddy YS Jagan BRS TDP YSRCP Telangana Politics Andhra Pradesh
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News