డీఎస్సీ అంటేనే చంద్రబాబు... టిడిపి ప్రభుత్వం అంటేనే డీఎస్సీ... అనే స్థాయిలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పాలిట దైవంగా సీఎం చంద్రబాబు మారిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అత్యధిక డీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చింది చంద్రబాబు హయాంలోనే అంటే అతిశయోక్తి కాదు. వైసిపి ఐదేళ్ల పాలనలో జగన్ టీచర్ పోస్టులు ఏవి భర్తీ చేయలేదు. కానీ, గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులతో చేయరని పనులు జగన్ చేయించారు.
అయితే ఎన్నికలకు ముందే 16,500 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చంద్రబాబు మాట ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ జంబో డీఎస్సీ ప్రకటించడమే కాకుండా వారి నియామకాలు కూడా జెట్ స్పీడ్ లో పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు మంత్రి నారా లోకేష్ సిద్ధమవుతున్నారు. నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ విషయం గురించి మాట్లాడారు. నోటిఫికేషన్ విడుదల మొదలు అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు