బొలిశెట్టి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్

admin
Published by Admin — October 01, 2026 in Politics
News Image

జనసేన ఎమ్మెల్యే బొల్లినేని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తన మరణం కోరుతూ కొందరు శత్రువులు, సొంత రాజకీయ ప్రత్యర్థులు తనపై చేతబడులు, పూజలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించిన విషయం షాకింగ్ గా మారింది.

మీడియాలో వస్తున్న వ్యతిరేక కథనాలు, జరుగుతున్న పరిణామాల వల్ల తన కుటుంబ సభ్యులు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాను అధికారంలో ఉంటేనే ప్రోటోకాల్ ఉంటుందని, లేకపోతే లేదని కూటమి నేతల తీరుపై ఆయన అసంతృప్తి వెళ్లగక్కారు. రాజకీయాల్లో శత్రువులైనా సరే ఎవరూ చనిపోవాలని తాను కోరుకోనని స్పష్టం చేశారు.

సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లపై తాను తప్పుగా మాట్లాడలేదని, కూటమి ప్రభుత్వంలో నిబద్ధతతో పనిచేస్తున్నానని తెలిపారు.

తన చావు కోరుతూ కొందరు రహస్యంగా పూజలు చేస్తున్నారని, పరిస్థితి ఇలాగే ఉంటే వారి పేర్లు బయటపెట్టాల్సి వస్తుందని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "నన్ను కొన్నాళ్లు బతకనివ్వండి.. అందరం కలిసి పని చేద్దాం" అని ఆయన అన్నారు. తనకు స్థానిక ఎమ్మెల్యేగా కనీస ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తనను కనీసం పిలవకుండానే, తాను వెళ్లకుండానే శిలాఫలకాలు ఆవిష్కరిస్తున్నారని మండిపడ్డారు.

Tags
Janasena MLA biliSetty Srinivas made shocking comments
Recent Comments
Leave a Comment

Related News