హీరోనా.. డైరెక్ట‌ర్‌రా.. ర‌వితేజ తన‌యుడి దారెటు..?

admin
Published by Admin — September 10, 2026 in Movies
News Image

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) తనయుడు మహాధన్ 'రాజా ది గ్రేట్' సినిమాలో బాలనటుడిగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ చిన్ననాటి స్క్రీన్ ప్రెజెన్స్ చూసి, త్వరలోనే పూర్తిస్థాయి హీరోగా మాస్ ఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. అయితే ఊహించని విధంగా వెండితెరకు కొంతకాలం దూరమైన మహాధన్, ఇటీవల మెగాఫోన్ పట్టి అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారడంతో ఫ్యాన్స్‌లో రకరకాల సందేహాలు మొదలయ్యాయి. అసలు అతడికి నటనపై ఆసక్తి పోయిందా, లేక దర్శకత్వానికే పూర్తిస్థాయిలో ఓటేస్తున్నాడా అనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో మొదలైంది.

ఈ సందేహాలకు మహాధన్ బావ, డెబ్యూ హీరో మాధవ్ భూపతిరాజు ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. మహాధన్ అంతిమ లక్ష్యం వెండితెరపై హీరోగా మెరవడమేనని స్పష్టం చేశాడు. అయితే స్క్రీన్ ముందుకు వచ్చేముందే సినిమా మేకింగ్‌కు సంబంధించిన ప్రతీ విభాగంపై పూర్తి అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతోనే అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్నాడ‌ని వెల్లడించాడు. ప్రస్తుతం తన ఫేవరెట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) నటిస్తున్న 'స్పిరిట్' చిత్రానికి మహాధన్ వర్క్ చేస్తున్నాడు. సెట్స్‌లో ప్రతి సన్నివేశాన్ని దగ్గరుండి గమనిస్తూ డైరెక్షన్ మెళకువలు నేర్చుకుంటున్నాడు.

ప్రస్తుతం 20 ఏళ్ల వయసున్న మహాధన్(Mahadhan), మరో రెండేళ్ల పాటు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో అనుభవం గడించి ఆ తర్వాతే సోలో హీరోగా అడుగుపెట్టే ప్లాన్‌లో ఉన్నాడు. మరోవైపు రవితేజ కుమార్తె మోక్షద కూడా ఇప్పటికే 'ఇరుముడి' సినిమాతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తన సత్తా చాటుకుంది. మొత్తంమీద మాస్ రాజా వారసులు కేవలం నటనకే పరిమితం కాకుండా, కెమెరా వెనుక కూడా పట్టు సాధిస్తూ ఆల్ రౌండర్లుగా నిలబడేందుకు గట్టి పునాది వేసుకుంటున్నారు.

Tags
Ravi Teja Mahadhan Spirit Movie Sandeep Reddy Vanga Prabhas Tollywood Raja The Great Telugu Cinema
Recent Comments
Leave a Comment

Related News