ఒక్క‌రు కాదు ఇద్ద‌రు.. `ఇరుముడి`ని మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్లే.!

admin
Published by Admin — September 01, 2026 in Movies
News Image

మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) కెరీర్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్న చిత్రం ఇరుముడి. విడుదలైన ప్రతిచోటా నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌లో రవితేజ సినిమాలకు ఉండే పరిధిని బద్దలు కొడుతూ, ఇప్పటికే ఈ చిత్రం 1.5 మిలియన్ డాలర్ల మార్క్‌ను ల్యాండ్ అయ్యింది. ఒక మాస్ హీరోగా ఆయన కెరీర్‌లో తొలిసారి ఈ స్థాయి ఓవర్సీస్ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ఇరుముడి’ ప్రత్యేక నిలిచింది.

అయితే ఈ బ్లాక్‌బస్టర్ స్క్రిప్ట్ మొదట రవితేజ(Ravi Teja) దగ్గరకు వెళ్లలేదన్న వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. డైరెక్టర్ శివ నిర్వాణ ఈ కథతో ముందుగా టాలీవుడ్ యంగ్ అండ్ ట్రెండింగ్ హీరో నాగచైతన్యను, అలాగే మరో మాస్ యాక్షన్ హీరో గోపీచంద్‌ను సంప్రదించారట. కానీ వివిధ కారణాల వల్ల ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఈ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాతే ఈ అరుదైన అవకాశం రవితేజ వద్దకు చేరి, ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైలురాయిగా నిలిచింది.

ఒకవేళ ఈ కథ నాగచైతన్య(Naga Chaitanya) వద్దే ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేదనే చర్చ నడుస్తోంది. ఇరుముడి చిత్రంలో హీరో పాత్రకు కావాల్సింది కేవలం గ్లామర్ కాదు, ఒక మెచ్యూరిటీ, సీనియర్ స్క్రీన్ ప్రెజెన్స్, ముఖ్యంగా ఎమోషనల్ డెప్త్ చాలా అవసరం. తండ్రి సెంటిమెంట్‌ను పండించడంలో నూతన పరిణతితో పాటు, కొన్ని కీలక సన్నివేశాల్లో బాడీ ఫిజిక్ కూడా చాలా కీలకం. చైతన్య లుక్స్, యంగ్ ఏజ్ ఈ మాస్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్‌కు అంతగా సెట్ అయ్యేవి కావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు గోపీచంద్ విషయానికి వస్తే, ఆయనకు ఈ తరహా యాక్షన్ రోల్స్ కొకొల్లలు. ఆయన వయసు, రూపం ఈ పాత్రకు సరిగ్గా సరిపోయేవే. ఒకవేళ ఆయన చేసి ఉంటే, కెరీర్‌పరంగా ఇదొక సాలిడ్ కమ్‌బ్యాక్ అయ్యే అవకాశం ఉండేది. కానీ రవితేజ తనదైన ఎనర్జీతో, మాస్ మ్యానరిజమ్స్‌తో ఈ క్యారెక్టర్‌కు ప్రాణం పోసినంతగా ఇంకెవరూ ప్రభావం చూపలేరనేది స్పష్టమవుతోంది. ఏదేమైనా ఆ ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేసిన ఇరుముడి(Irumudi) కథ రవితేజ రూపంలో గోల్డెన్ ఛాన్స్‌గా మారి, బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.

Tags
Ravi Teja Irumudi Tollywood News Telugu Cinema Naga Chaitanya Gopichand
Recent Comments
Leave a Comment

Related News