దుమ్ము రేపుతోన్న నాని, కీర్తి సురేష్

admin
Published by Admin — August 29, 2026 in Movies
News Image

'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రంపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్‌ ఆయా షేర్ తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. రిలీజ్ డేట్ సెప్టెంబరు 24 దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ల జోరు పెంచింది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సింగిల్ 'యేష నాగుల కట్ట మీద' రిలీజైంది. నానితో కలిసి కీర్తి సురేష్ ఊర మాస్ స్టెప్పులేసిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.
 
కాసర్ల శ్యామ్ సాహిత్యానికి అనిరుధ్ రవిచందర్ బీట్ తోడవడంతో ఈ పాట మరో చార్ట్ బస్టర్ కానుంది. జంగి రెడ్డి, ప్రభ పాడిన ఈ పాటలో నాని, కీర్తి సురేశ్ మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటను అమెరికాలోని డల్లాస్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ లైవ్ కాన్సర్ట్‌లో లాంచ్ చేశారు. పొడవాటి జుట్టు, రెక్కల డిజైన్‌తో ఉన్న ప్రత్యేక జాకెట్‌తో జడల్ లుక్ లో నాని సర్ప్రైజ్ ఎంట్రీ ఇవ్వడంతో ఆయన అభిమానులకు పూనకాలు వచ్చాయి. ఇక, అనిరుధ్‌తో కలిసి నాని స్టేజిపై చిందేసి అలరించారు. ఇరుగు దిష్టి..పొరుగు దిష్టి అంటూ ప్రేక్షకులతో ఆ డైలాగ్ చెప్పించారు నాని. ఇక, కీర్తి సురేశ్, నాని మధ్య సోషల్ మీడియాలో ఈ పాట గురించి జరిగిన సరదా సంభాషణ కూడా వైరల్ అయింది. ప్రస్తుతం యేష నాగుల కట్ట మీద పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Tags
yesha nagula katta song keerti suresh nani paradise movie trending
Recent Comments
Leave a Comment

Related News