విజయ్ కొంప ముంచుతున్న ఆ ఒక్క పొరపాటు!

admin
Published by Admin — August 16, 2026 in Politics
News Image

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక్క పేరు వినిపిస్తోంది.. అదే దళపతి విజయ్. సినిమా రంగంలో తిరుగులేని ఇమేజ్‌తో బాక్సాఫీస్‌ను ఏలిన విజయ్, 'తమిళ వెట్రి కజగం' (TVK) పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి తొలి ప్ర‌య‌త్నంలోనే సీఎం అయ్యారు. ప్రజల్లో ఆయనకు ఉన్న క్రేజ్ చూసి ప్రత్యర్థి పార్టీలు సైతం హడలిపోయాయి. కానీ, పార్టీని ప్రజల్లోకి దూసుకెళ్లేలా చేయాల్సిన కీలకమైన సమయంలో, విజయ్ చేస్తున్న చిన్న చిన్న నిర్లక్ష్యాలు ఆయన కొంప ముంచుతున్నాయనే చర్చ ఇప్పుడు కోలీవుడ్ నుంచి చెన్నై పొలిటికల్ సర్కిల్స్ వరకు గట్టిగా నడుస్తోంది.

రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో అడుగులు చాలా జాగ్రత్తగా వేయాలి. ప్రతీ కదలికపైనా ప్రత్యర్థుల నిఘా ఉంటుంది. సరిగ్గా ఇదే విషయంలో విజయ్ వర్గం తీవ్రమైన అస్పతలను ప్రదర్శిస్తోంది. అధికారిక పార్టీ కార్యక్రమాలలో నటి త్రిష హావభావాలు, ఆమెకు దక్కుతున్న ప్రాధాన్యత ఇప్పుడు రాజకీయంగా పెను దుమారానికి దారితీసింది. త్రిష పార్టీలో ఉంటే అధికారికంగా మెంబర్ షిప్ ఇవ్వాలి, లేదా ప్రచార బాధ్యతలు అప్పగించాలి. ఈ రెండూ కాకుండా ఆమెను పక్కన పెట్టుకుని తిరగడం, ప్రోటోకాల్ ఇవ్వడం ప్రత్యర్థి పార్టీలైన డీఎంకే(DMK), ఏఐఏడీఎంకేలకు బలమైన అస్త్రంలా మారింది.

రాజకీయాల్లో జెండా, ఎజెండా, ప్రజా సమస్యలపై పోరాటాలు ముఖ్యం. కానీ, ప్రస్తుతం టీవీకే పార్టీ విధానాల కంటే విజయ్ వ్యక్తిగత జీవితం, త్రిష(Trisha) చుట్టూ తిరుగుతున్న వార్తలే మీడియాలో హెడ్‌లైన్స్ అవుతున్నాయి. ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ప్రత్యర్థులు దీన్నే మెయిన్ టార్గెట్ చేసుకుని విమర్శల దాడిని పెంచారు. ప్రారంభంలో అభిమానులు వీటిని లైట్ తీసుకున్నా, కాలం గడిచేకొద్దీ ఇలాంటి నెగెటివ్ పాయింట్లు సాధారణ ఓటర్ల మీద తీవ్ర ప్రభావం చూపుతాయి.

ఒక పార్టీకి నాయకత్వం వహించే వ్యక్తి తన వ్యక్తిగత సంబంధాలకు, రాజకీయ బాధ్యతలకు మధ్య గోడ కట్టడం చాలా ముఖ్యం. పుకార్లకు, విమర్శలకు ఎక్కడా తావు ఇవ్వకుండా క్లారిటీగా ఉండాలి. కానీ, విజయ్(Vijay) ఈ విషయంలో మౌనం వహించడం లేదా సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల రోజూ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలా డిఫెన్స్ మోడ్‌లోనే కాలం గడిపేస్తే, ఇక పాలనపై దృష్టి పెట్టడం ఎలా సాధ్యమవుతుంది? ఇప్పటికైనా విజయ్ ఈ వ్యక్తిగత వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టి, తన రాజకీయ భవిష్యత్తుపై పూర్తి స్పష్టత ఇస్తేనే తమిళనాట బలమైన శక్తిగా ఎదగగలరు.

Tags
Thalapathy Vijay TVK Tamil Nadu Politics Vijay Trisha Kollywood News
Recent Comments
Leave a Comment

Related News