మేనకోడలి వివాహం.. జగన్‌కు ప్రాణహాని..!

admin
Published by Admin — October 23, 2026 in Politics, Andhra
News Image

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే వైఎస్సార్ కుటుంబంలో మరోసారి ప్రకంపనలు రేగాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కుమార్తె అంజలి రెడ్డి వివాహం వేళ తెరపైకి వచ్చిన యెలహంక ప్యాలెస్ వివాదం ఇప్పుడు నూతన మలుపు తిరిగింది. ఒకవైపు వేడుకకు ముహూర్తం దగ్గరపడుతుండగా.. మరోవైపు బెంగళూరులోని ఆ అత్యంత ప్రతిష్టాత్మక నివాసంలో పెళ్లి వేడుక నిర్వహణపై జరుగుతున్న రచ్చ తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు మేనకోడలి పెళ్లికి సొంత మావయ్యే ఎందుకు నో చెప్పారు? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? అన్న అంశాలు హాట్ టాపిక్‌గా మారిన తరుణంలో.. వైసీపీ వాదన ఒకవైపు, షర్మిల వర్గం వాదన మరోవైపు వినిపిస్తున్నాయి.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy)కి కల్పించిన భద్రతా ప్రోటోకాల్స్ అత్యంత కఠినమైనవి. వైఎస్సార్‌సీపీ వర్గాల సమాచారం ప్రకారం.. బెంగళూరులోని యెలహంక నివాసం సెక్యూరిటీ పరంగా చాలా సమస్యాత్మకమైన ప్రాంతం. అటువంటి చోట భారీ స్థాయిలో వివాహ వేడుక జరిపితే దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులు, వీఐపీలు, మీడియా ప్రతినిధులు, వేలాదిగా అతిథులు తరలివస్తారు. ఈ భారీ జనసందోమం మధ్య ఎవరు వస్తున్నారో, ఎవరెవరు తిరుగుతున్నారో గుర్తించడం భద్రతా సిబ్బందికి కత్తి మీద సాములా మారుతుంది. ఇది కేవలం రద్దీ సమస్య మాత్రమే కాదని, వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా మున్ముందు భద్రతాపరమైన తీవ్ర అంతరాయాలకు దారితీసే అవకాశం ఉందని ఆయన వర్గం గట్టిగా భావిస్తోంది. అలాగే వేడుక సమయంలో జరిగే హడావుడి వల్ల ఇంటి అంతర్గత విజువల్స్, ప్రైవసీకి భంగం వాటిల్లుతుందని, అందుకే ఈ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి జగన్ సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇదే సాకుగా చూపించి యెలహంక ప్యాలెస్ లో మేనకోడలి పెళ్లికి నో చెప్పేశారు జగన్‌. 

మరోవైపు ఈ వివాదం వెనుక కేవలం భద్రతా కారణాలే కాకుండా బలమైన రాజకీయ వ్యూహాలు కూడా ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తోంది. షర్మిల కుమార్తె వివాహానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. అటువంటి కీలక సమయంలో జగన్ సొంత నివాస వేదికగా కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశాలు, అనధికారిక రాజకీయ మంతనాలు జరిగే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఏపీ(AP) రాజకీయాల్లో అధికార కూటమిని గట్టిగా ఎదుర్కొంటున్న వైఎస్ జగన్‌కు, తన సొంత ఇంట్లోనే ప్రత్యర్థి పార్టీ కీలక సమావేశాలు జరగడం రాజకీయంగా ఇబ్బందికర పరిణామాలకు దారితీస్తుందనే అంచనాలున్నాయి.

ఇక ఈ వ్యవహారాన్ని షర్మిల మద్దతుదారులు మాత్రం పూర్తిగా మరో కోణంలో చూస్తున్నారు. ఆస్తుల పంపకాల విషయంలో గత ఐదేళ్లుగా జరుగుతున్న న్యాయపోరాటాలు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) వరకు వెళ్లిన వివాదాల కొనసాగింపుగానే దీన్ని భావిస్తున్నారు. యెలహంక కాంపౌండ్‌లో షర్మిలకు కూడా స్పష్టమైన హక్కులున్నాయని, కూతురి పెళ్లి కోసం కేవలం ఒక్క రోజు వేదిక ఇస్తే వచ్చే నష్టమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కుటుంబ పెద్దగా వైఎస్ విజయమ్మ(Vijayamma) స్వయంగా రంగంలోకి దిగి జగన్‌ను ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన తన నిర్ణయం మార్చుకోలేదని తెలుస్తోంది. ఇప్పటికే వెడ్డింగ్ ఇన్విటేషన్ల పంపిణీ మొదలైపోవడంతో.. యెలహంక ప్యాలెస్‌లో నో ఎంట్రీ క్లారిటీ రావడంతో షర్మిల బృందం ప్రత్యామ్నాయ వేటలో పడింది. బెంగళూరు లేదా హైదరాబాద్‌ పరిసరాల్లో వీఐపీల భద్రతకు, భారీ జనసందర్శనకు తగిన మరో గ్రాండ్ వెడ్డింగ్ డెస్టినేషన్‌ను వెతికే పనిలో షర్మిల నిమగ్నమయ్యారు.

Tags
YS Jagan YS Sharmila YSR Family Yelahanka Palace Andhra Pradesh YS Anjili Reddy YS Anjili Reddy Wedding
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News