స్టేజిపై ఆ హీరోయిన్ ఎమోషనల్

admin
Published by Admin — July 13, 2026 in Movies
News Image

లెనిన్ సినిమా ఇందులో ఇన్వాల్వ్ అయిన చాలామందికి చాలా కీల‌క‌మైన సినిమా. ముఖ్యంగా ఇప్ప‌టిదాకా కెరీర్లో నిఖార్స‌యిన హిట్టు అందుకోని హీరో హీరోయిన్లు అక్కినేని అఖిల్, భాగ్య‌శ్రీ బోర్సేల‌కు ఈ చిత్రం ఎంతో కీల‌కంగా మారింది. వాళ్లిద్ద‌రి ఆశ తీర్చేలా లెనిన్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి ప్ర‌భావ‌మే చూపుతోంది. తొలి రోజే కాదు.. రెండో రోజూ సినిమాకు వ‌సూళ్లు బాగున్నాయి.  ఈ నేప‌థ్యంలో రిలీజ్ రోజు అఖిల్ తీవ్ర భావోద్వేగంతో క‌న్నీళ్లు పెట్టుకుంటే.. రెండో రోజు స‌క్సెస్ మీట్లో భాగ్య‌శ్రీ ఎమోష‌న‌ల్ అయి.. స్టేజ్ మీద ఏడ్చేసింది.  ఈ సినిమా ఫ‌లితం ఆమెను ఎంత‌గా భావోద్వేగానికి గురి చేసిందో త‌న స్పంద‌న చూస్తే అర్థ‌మైంది.

లెనిన్ రిలీజ్‌కు ముందు ఆమె ఎంత టెన్ష‌న్ ప‌డిందో.. ఆమెకు తాను ఎలా ధైర్యం చెప్పానో నిర్మాత అక్కినేని నాగార్జున త‌న ప్ర‌సంగంలో వెల్లడించాడు. లెనిన్ రిలీజ్‌కు ముందు రోజు భాగ్య‌శ్రీ త‌న‌తో మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్ష‌కులు ఇప్ప‌టిదాకా త‌నకు వాలిడేష‌న్ ఇవ్వ‌లేదంటూ బాధ ప‌డ్డ‌ట్లు నాగ్ తెలిపాడు. తాను అందంగా ఉంటాన‌ని.. బాగా న‌టిస్తాన‌ని.. డ్యాన్సులు బాగా చేస్తానని.. ఇలా ఎన్ని కామెంట్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఏడాదిన్న‌ర కెరీర్ పూర్త‌యినా స‌రే త‌న‌కు హిట్ మాత్రం రాలేద‌ని.. ఎందుకిలా జ‌రుగుతోందో అని భాగ్య‌శ్రీ అన్న‌ట్లు నాగ్ తెలిపాడు.  దానికి తాను బ‌దులిస్తూ.. ఇందులో నీ త‌ప్పేం లేద‌మ్మా, త‌ప్పంతా మాదే అని అన్న‌ట్లు నాగ్ వెల్ల‌డించాడు.

ఆమె త‌న ప‌ని స‌రిగ్గానే చేస్తోంద‌ని.. తామే స‌రిగా సినిమాలు తీసి త‌న‌కు హిట్ ఇవ్వ‌లేక‌పోయామ‌ని నాగ్ చెప్పాడు. ఐతే త‌న టెన్ష‌న్ గ‌మ‌నించి లెనిన్ సినిమాతో అంతా మారిపోతుంద‌ని, వెళ్లి సినిమా చూడు అని ధైర్యం చెప్పి త‌న‌కు అన్న‌పూర్ణ స్టూడియోలో షో వేయించాన‌ని.. త‌ర్వాతి రోజు నీకు బ్రేక్ వస్తుంద‌ని చెప్పాన‌ని.. అన్న‌ట్లే ఇప్పుడు ప్రామిస్ నిల‌బెట్టుకున్నాన‌ని నాగ్ వ్యాఖ్యానించాడు. లెనిన్ ఈవెంట్లో భాగ్య‌శ్రీ అంత ఎమోష‌న‌ల్ అవ్వ‌డం.. నాగ్ ఈ సినిమా రిలీజ్‌కు ముందు జ‌రిగిన విష‌యాలు చెప్ప‌డం చూస్తే.. ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అన్న‌ది ఎంత కీల‌క‌మో అర్థ‌మ‌వుతుంది.

Tags
heroine bhagyasri borse lenin movie nagarjuna emotional
Recent Comments
Leave a Comment

Related News