పవన్, బాబుల బంధం ఫెవికాల్ కంటే స్ట్రాంగ్!

admin
Published by Admin — July 13, 2026 in Politics
News Image
ఏపీ సీఎం చంద్ర‌బాబుకు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌ధ్య స్నేహ బంధం మ‌రింత బ‌ల‌ప‌డింది. రాజ‌కీయం కోస‌మే పొత్తులు అనే మాట‌ను ప‌క్క‌న పెట్టి.. మాన‌వ‌త్వం దిశ‌గా ఇరువురి మ‌ధ్య స్నేహం మ‌రింత బ‌లోపేతం అయింది. ప్ర‌స్తుతం కుడిభుజానికి ఆప‌రేష‌న్ జ‌ర‌గ‌డంతో ముంబైలోని ఆసుప‌త్రిలో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా అక్క‌డికి వెళ్లి ప‌రామ‌ర్శించారు. ఆసుప‌త్రిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్న గ‌దిలోకే వెళ్లి... ఆయ‌న ప‌క్క‌న కూర్చుని ప‌రామ‌ర్శించారు.
 
శ‌నివారం.. ప‌వ‌న్ క‌ల్యాణ్ కుడిభుజం రొటేట‌రీ క్ల‌ఫ్‌కు ముంబైలోని కోకిలాబెన్ ఆసుప‌త్రిలో ఆప‌రేష‌న్ నిర్వహించారు. ఈ ఆప‌రేష‌న్ స‌క్సెస్ అయింది. మ‌రో నెల రోజుల్లో ఎడ‌మ భుజానికి కూడా ఆప‌రేష‌న్ చేయనున్నారు., ఈ నేప‌థ్యంలో ఆసుప‌త్రిలో ఉన్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను చంద్ర‌బాబు ఆదివారం ప‌రామ ర్శించారు. అమ‌రావ‌తి నుంచి నేరుగా ముంబైకి వెళ్లిన ఆయ‌న‌.. ఆసుప‌త్రిలో ప‌వ‌న్ విశ్రాంతి తీసుకుంటు న్న రూమ్‌లోకి వెళ్లి.. ఆయ‌న‌ను క‌లిసి ప‌రామ‌ర్శించారు. ఆరోగ్యం త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.
 
కాగా.. గ‌త నెల‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు హైద‌రాబాద్‌లో ముక్కుకు స‌ర్జ‌రీ జ‌రిగింది. త్వ‌ర‌లోనే రెండో భుజానికి కూడా ఆప‌రేష‌న్ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఆరోగ్యంగా ఉండాల‌ని, త్వ‌ర‌లోనే ప్ర‌జా జీవితంలోకి రావాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్టు చంద్ర‌బాబు పేర్కొన్నారు. ప‌వ‌న్ ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే వ్య‌క్తి అని తెలిపారు. ఆయ‌నకు ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం ఉంద‌ని అన్నారు. కాగా, ఈ ప‌ర్య‌ట‌న‌లో జ‌న‌సేన నాయ‌కుడు, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ స‌హా.. ప‌లువురు టీడీపీ మంత్రులు కూడా పాల్గొని.. ప‌వ‌న్ ను ప‌రామ‌ర్శించారు.
 
రాజ‌కీయంగా చ‌ర్చ‌..
 
పవ‌న్ క‌ల్యాణ్‌ను చంద్ర‌బాబు క‌లిసి ప‌రామ‌ర్శించ‌డం.. రాజ‌కీయంగా కూడా ఆస‌క్తిగా మారింది. జ‌న‌సేన వ‌ర్గాలు కేడ‌ర్ సంతృప్తి వ్య‌క్తం చేశాయి. స‌హ‌జంగా ఇలాంటి ప‌రిస్థితిలో కోలుకుని ఇంటికి చేరుకునే వ‌ర‌కు వేచి చూడ‌కుండా చంద్ర‌బాబు స్వ‌యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ముంబైలోనే ప‌రామ‌ర్శించ‌డం.. ఆయ‌న చాలా సేపు.. ఆసుప‌త్రిలోనే ఉండ‌డం, ప‌వ‌న్‌కు భ‌రోసా క‌ల్పించ‌డం వంటివి ఇరు పార్టీల మ‌ధ్య మ‌రింత సాన్నిహిత్యాన్ని పెంచుతాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.
Tags
cm chandrababu AP deputy CM Pawan Kalyan bonding strong fevicol
Recent Comments
Leave a Comment

Related News