రాత్రి తాగ‌డం.. పొద్దునే వాగ‌డం.. ప్రకాష్ రాజ్‌పై బండ్లన్న సెటైర్స్‌!

admin
Published by Admin — July 06, 2026 in Movies
News Image

రాజకీయాల్లో మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు సినీ పరిశ్రమలో వ్యక్తిగత దూషణల పర్వానికి దారితీసింది. యూట్యూబర్ ప్రశ్న రావణ్(Prashna Raavan) అరెస్ట్ ఎపిసోడ్ ఇటు ఏపీ రాజకీయాలనే కాకుండా, టాలీవుడ్‌ను కూడా కుదిపేస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిన రావణ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో, ఈ ఇష్యూలోకి ప్రకాష్ రాజ్ ఎంటర్ అయ్యారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ప్రశ్నించే గొంతులను నొక్కుతోందంటూ ఆయన చేసిన గేమ్ ఆన్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

అయితే, ప్రకాష్ రాజ్(Prakash Raj) కామెంట్స్‌పై పవన్ కల్యాణ్ వీరాభిమాని, నిర్మాత బండ్ల గణేష్ ఊహించని రీతిలో రియాక్ట్ అయ్యారు. ప్రకాష్ రాజ్ వ్యక్తిగత అలవాట్లను, ఆయన కెరీర్‌ను టార్గెట్ చేస్తూ బండ్లన్న వేసిన సెటైర్లు ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. "రాత్రి తాగుతావు.. ఉదయాన్నే వాగుతావు" అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సినీ, రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా మంటలు రేపింది.

"నీ జీవితంలో చెప్పుకోదగ్గ ఒక్క మంచి పని కూడా లేదు. నీకు ఇప్పుడు సినిమాలు లేవు, షూటింగులు లేవు.. కేవలం పనికిరాని మాటలు, గొడవలే నీ దినచర్య. హాయిగా నీ పని నువ్వు చూసుకుని, సంతోషంగా బతుకు. అనవసరంగా ఇతరుల గురించి నోరు పారేసుకుని నీ విలువను నువ్వే తగ్గించుకోకు." అంటూ బండ్ల గణేష్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న సోషల్ మీడియా వార్‌తో ఇండస్ట్రీ ఒక్కసారిగా హీటెక్కింది. ప్రకాష్ రాజ్ ప్రభుత్వానికి సవాల్ విసిరితే.. బండ్ల గణేష్(Bandla Ganesh) మాత్రం ప్రకాష్ రాజ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. మ‌రి ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఈ వ్యక్తిగత ఆరోపణలు ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

https://x.com/ganeshbandla/status/2074006776157253984

Tags
Bandla Ganesh Prakash Raj Prashna Raavan Arrest Pawan Kalyan Tollywood AP Politics Andhra Pradesh
Recent Comments
Leave a Comment

Related News