ఏపీఎన్నార్టీ కో ఆర్డినేటర్ల నామినేటెడ్ లిస్ట్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం!

admin
Published by Admin — July 02, 2026 in Nri
News Image

ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్ల నామినేటెడ్ లిస్ట్ కోసం ఈ క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి....

https://apnrts.ap.gov.in/coordinators_list

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులు తమ వంతు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా పలు దేశాలలో పలువురు ప్రవాసాంధ్రులను ఏపీఎన్నార్టీ కో ఆర్డినేటర్లుగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికాతో పాటు పలు దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రుల అభ్యున్నతితో, సంక్షేమం కోసం పాటుపడేందుకు ఈ నియామకాలను చేపట్టింది. త్వరలోనే సెంట్రల్ కమిటీ కోఆర్డినేటర్లను కూడా నామినేట్ చేస్తామని తెలిపింది.

ఏపీఎన్నార్టీఎస్ తో సమన్వయం చేసుకుంటూ తమ ప్రాంతాలలోని ప్రవాసాంధ్రుల సంక్షేమం, అభ్యున్నతికి కృషి చేయాలని ఏపీఎన్నార్టీ కో ఆర్డినేటర్లకు ప్రభుత్వం సూచించింది. భారత ఎంబసీ, స్థానిక ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ వారు స్వచ్ఛందంగా సేవలందించనున్నారు. ఏపీ ప్రభుత్వంతోపాటు, ఏపీఎన్నార్టీఎస్ విదేశాలలో చేపట్టే పలు కార్యక్రమాలకు అనుగుణంగా ప్రవాసాంధ్రులకు ఈ కో ఆర్డినేటర్లు సహాయసహకారాలు అందిస్తారు. నూతనంగా నియమితులైన ఏపీఎన్నార్టీ కో ఆర్డినేటర్లకు ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీఎన్నార్టీఎస్ ప్రెసిడెంట్ రవి వేమూరు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీఎన్నార్టీ కో ఆర్డినేటర్లుగా నియమితులైన ప్రవాసాంధ్రులకు ‘నమస్తే ఆంధ్ర’ తరఫున హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Tags
APNRTS APNRT APNRTS president doctor ravi vemuru NRI affairs minister kondapalli srinivas Apnrt coordinators Nominated List Ap government
Recent Comments
Leave a Comment

Related News