గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా సెప్టెంబర్ 9న బాధ్యతలు స్వీకరించిన అనంతరం డా. రాజా.....ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు (ఎన్‌ఆర్‌ఐలు) ప్రస్తుతం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, వారి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిలో ఎన్‌ఆర్‌ఐల భాగస్వామ్యం తదితర అంశాల గురించి సీఎం చంద్రబాబుతో డాక్టర్. రాజా చర్చించారు.
“ఇదే జోష్‌తో ముందుకు సాగండి. మీకు నా నుంచి ఏం కావాలో చెప్పండి” అని డాక్టర్ రాజాను సీఎం చంద్రబాబు వెన్నుతట్టి ప్రోత్సహించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఆర్‌ఐలతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడేందుకు కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారి జూమ్ సమావేశం నిర్వహించాలని డా. రాజా విజ్ఞప్తి చేశారు.
ఈ విజ్ఞప్తికి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి, సమావేశానికి సంబంధించిన షెడ్యూల్‌ను సిద్ధం చేయాలని సూచించారు.
తనపై నమ్మకం ఉంచి గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి డా. రాజా మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి అందించిన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం తనకు మరింత బాధ్యతతో పనిచేసేందుకు స్ఫూర్తినిచ్చాయని డా. రాజా పేర్కొన్నారు.
గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీని మరింత బలోపేతం చేస్తూ, ప్రవాసాంధ్రుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని డా. రాజా తెలిపారు.